Tuesday, November 19, 2024

టిసియస్ కు విద్యార్థుల ఎంపిక – అభినందించిన కళాశాల యాజమాన్యం..

మార్కాపురం : సాఫ్ట్‌వేర్‌ రంగంలో ఉపాధి కోసం ప్రసిద్ద టిసియస్‌ సంస్థ ఆన్‌లైన్‌ ద్వారా జాతీయ స్థాయిలో వివిధ కేంద్రాలలో నిర్వహించిన నైపుణ్య పరీక్షలో 10 మంది శ్రీసాధన విద్యార్థులు ఉత్తీర్ణులైనట్లు ప్రిన్సిపల్‌ డా. కప్పగంతుల మధుసూదన్‌ తెలిపారు. టాటా కన్సల్టెన్సీ ద్వారా నియామకాలు నిర్వహించే 150 బహుళజాతీయ ఐటి పరిశ్రమ ఉద్యోగాలకు యువత నేరుగా ముఖాముఖి పరీక్షకు అర్హత సాధిస్తారని, సంభాషణ నైపుణ్యాల మేరకు ఉద్యోగాలు పొందగలరని ప్రిన్సిపల్‌ డా, మధుసూదన్‌ వివరించారు. కళాశాల ఉపాధి కల్పనా విభాగం ఆధ్వర్యంలో శిక్షణ పొందిన ఈ విద్యార్థులు 100శాతం కృతార్థులు కావడం పట్ల కళాశాల సెక్రటరీ కరస్పాండెంట్‌ రాజగోపాలరెడ్డి, డైరెక్టర్లు జిఎల్‌ రమేష్‌బాబు, యం.వి కృష్ణారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. శనివారం ఉదయం కళాశాలలో ప్లేస్‌మెంట్‌ విభాగం ఆధ్వర్యంలో జరిగిన అభినందన కార్యక్రమంలో విభాగం కన్వీనర్‌ కె.పవన్‌కుమార్‌, రీసెర్చ్‌సెల్‌ కన్వీనర్‌ డా. యం.శేషుకుమార్‌, కెరీర్‌గైడెన్స్‌ బాధ్యులు పి.శ్రీధర్‌కుమార్‌ విజేతలను అభినందించారు. బిఎస్సీ నుండి పి.సంపూర్ణ, షేక్‌. బిల్‌కిష్‌, యం.లక్ష్మీపావని, టి.కిరణ్‌, పి.తేజ, నాగేంద్రబాబుగౌడ్‌, షేక్‌. రహమాన్‌, డి.కరిముల్లాసాహెబ్‌, షేక్‌. మహ్మద్‌రఫి, బికాం నుండి టి.భానుప్రకాష్‌, టిసియస్‌ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించారు. ఈ సంధర్భంగా విజేతలను కళాశాల అధ్యాపక బృందం అభినందించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement