దర్శి, (ప్రభ న్యూస్) : దర్శి నగర పంచాయతీ ఎన్నికల నిర్వహణను ఆటంకపరిచినా, శాంతి భద్రతలకు విఘాతం కలిగించినా చట్టపరమైన చర్యలు తప్పవని ఎస్పీ మలిక గర్గ్ అన్నారు.గతంలో వివిధ కారణాలతో ఎన్నికలు జరగకుండా నిలిచిపోయిన స్థానిక సంస్థలకు (పంచాయతీ, మున్సిపల్, ఎంపీటీ-సీ స్థానాలకు) ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఎస్పీ దర్శి సర్కిల్ ఆఫీసులో పోలీసు అధికారులతో నగర పంచాయతీ ఎన్నికలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులకు, ఎన్నికల సమయములో ఎటు-వంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా చూడాలని పోలీస్ అధికారులకు సూచించారు. దర్శిలోని డీఎస్పీ ఆఫీస్, సర్కిల్ ఆఫీస్, పోలీస్ స్టేషన్, డీఎస్పీ ఆఫీస్ కేటాయించబడిన స్థలంలో పోలీస్ క్వార్టర్స్‌ను ఎస్పీ పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.
దర్శి పట్టణంలోని ఎల్పీ రోడ్డు వద్ద ఉన్న పోలింగ్ కేంద్రాలను, ప్రభుత్వ, జూనియర్ కాలేజీలోని పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాట్లను పరిశీలించి, ఆయా కేంద్రాల వద్ద తీసుకోవాల్సిన భద్రతా చర్యలు, అమలు చేయాల్సిన ఎన్నికల నియమ నిబంధనలపై అధికారులకు పలు సూచనలు చేశారు. పోలీసులు ఇతర ప్రభుత్వ విభాగాలతో సమన్వయం చేసుకుని ఎన్నికలు ప్రశాంతంగా ముగిసేలా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రజలు ప్రశాంత వాతావరణంలో స్వేచ్చగా తమ ఓటు- హక్కును వినియోగించుకోవాటానికి అవసరమైన ఏర్పాట్లు- చేయాలని అధికారులకు సూచించారు.
ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ దర్శి నగర పంచాయతీకి ఈ నెల 15న ఎన్నికలు జరగనున్నందున ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా, ప్రజలను ప్రలోభాలకు గురి చేసే అక్రమ మద్యం, నగదు, ఇతర విలువైన వస్తువుల రవాణాను నిరోధించటానికి చెక్ పోస్టుల వద్ద ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నామని, మిగిలిపోయిన స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా స్పెషల్ పెట్రోలింగ్ టీ-మ్స్ ఏర్పాటు- చేశామని, ఎలక్షన్ జరగబోయే ప్రాంతాల్లో రూట్ మార్చ్ నిర్వహించామని, పోలింగ్ కేంద్రాల వద్ద బారికేడ్స్, క్యూలైన్ల వంటివి ఏర్పాటు- చేసినట్లు- తెలిపారు.
ప్రజలందరూ కూడా ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు నిర్వహణకు సహకరించాలని కోరారు. సమాచారం ఎప్పటికప్పుడు పోలీసు అధికారులకు తెలియపరచాలని సూచించారు. అనంతరం హై స్కూల్, జూనియర్ , డిగ్రీ కాలేజీలోని విద్యార్థులతో జిల్లా ఎస్పీ ముచ్చటించారు. జిల్లాలో రేపు నారిశెట్టివారి పాలెం గ్రామ పంచాయతీ ఎన్నికలు రెండు లొకేషన్స్‌లో జరుగుతాయని, ఆ ఎన్నికల బందోబస్త్ నిమిత్తం 63 మంది అధికారులు , సిబ్బందిని కేటాయించామని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో దర్శి డీఎస్పీ నారాయణ స్వామిరెడ్డి, డీఎస్పీ బి.మరియాదాసు , దర్శి సిీఐ ఎం.భీమానాయక్, పొదిలి సిీఐ సుధాకర్ , అద్దంకి సిీఐ ఎం. రాజేష్ , ఎఎస్సైలు , ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
లోకల్ టు గ్లోబల్.. రియల్ టైమ్ న్యూస్ అప్ డేట్స్ కోసం.. ప్రభన్యూస్ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily