త్వరలో గుండ్లకమ్మ ప్రాజెక్టు గేట్లను మరమ్మతులు చేయిస్తామని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. ప్రకాశం జిల్లాలోని గుండ్లకమ్మ ప్రాజెక్టును మంత్రి రాంబాబు పరిశీలించారు. మొన్న రాత్రి ప్రాజెక్టుకు వచ్చిన భారీ వరదతో మూడో గేటు కొట్టుకుపోయింది. ఈరోజు ప్రాజెక్టును సందర్శించిన అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. గేట్లు ఐదారేళ్లుగా తుప్పుపట్టి ఉండడంతో గేటు దెబ్బతిందని దీంతో నీళ్లు బయటకు పోయాయని మంత్రి తెలిపారు. గత ప్రభుత్వం ప్రాజెక్టుల నిర్వహణలో అశ్రద్ధ చేయడం వల్లే తరుచూ ప్రాజెక్టు గేట్లు మరమ్మతులకు లోనవుతున్నాయని ఆరోపించారు. రెండు టీఎంసీలు సముద్రంలోకి వదలక తప్పదని వెల్లడించారు. గేట్ల మరమ్మతులను త్వరలో ప్రారంభిస్తామని వివరించారు. ఖరీఫ్‌కు సాగర్ నుంచి నీరు మళ్లించి గుండ్లకమ్మ నింపుతామని పేర్కొన్నారు. రైతులు ఆందోళన చెంద వలసిన అవసరం లేదని స్పష్టం చేశారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement