ఒంగోలు, ప్రభన్యూస్ : రాష్ట్రంలో సామాన్యుడి బతుకు భారమవుతోంది. ఓ వైపు నిత్యావసర ధరలు మండుతున్నాయి. వీటికి తోడు ఇటీవల విద్యుత్ ఛార్జీలను భారీగా పెంచారు. ఆ బాధ నుంచి కోలుకోక ముందే మరో షాక్ ఇచ్చింది ప్రభుత్వం ! రాష్ట్రంలో ఆర్టీసీ ఛార్జీలు పెంచుతూ నిర ్ణయం తీసుకుంది. డీజిల్ రేట్లు పెరగడంతో బస్సు ఛార్జీలు తప్పని పరిస్థితుల్లో పెంచుతున్నామని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు స్పష్టం చేశారు. తాజా రేట్ల ప్రకారం ఇక పై పల్లె వెలుగు బస్సుకు 2 రూపాయలు, ఎక్స్‌ప్రెస్ బస్సు పై 5 రూపాయలు, ఏసీ బస్సులకు రూ.10 రూపాయలు పెంచారు. ఇక పై పల్లె వెలుగు బస్సుల్లో కనిష్ట ఛార్జి రూ.10 రూపాయలు ఉంటుంది. పెరిగిన ఆర్టీసీ ధరలు నేటి నుంచే అమల్లోకి రానున్నాయి.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..