Tuesday, November 26, 2024

పిటిపి కార్మికులకు వేతన సవరణ..

ఉలవపాడు : పిటిపి ఫ్యాక్టరీ కార్మికులకు 2021 ఏప్రిల్‌ నుండి నూతన వేతన ఒప్పందం చేయాలని కోరుతూ ఉలవపాడు మండల కరేడు ర్యాంపులోని పిటిపి ఫ్యాక్టరీ జనరల్‌ మేనేజర్‌ ఉమా మహేశ్వరరావకుకు సిఐటియు జిల్లా కార్యదర్శి జి.శ్రీనివాసులు, పిటిపి స్టాఫ్‌ అండ్‌ వర్కర్స్‌ యూనియన్‌ గౌరవాధ్యక్షుడు జివిబి కుమార్‌, అధ్యక్ష కార్యదర్శులు సవరం శ్రీనివాసులు, చిమటా శ్రీనివాసులు, ఆఫీస్‌ బేరర్లు పి.మస్తాన్‌, బి.గంజి శ్రీనివాసులు, కె.మహేష్‌ తదితరులు చార్టర్‌ ఆఫ్‌ డిమాండ్‌ నోటీసు అందజేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు మాట్లాడుతూ ఈ నెల మార్చి 31వ తేదీతో వేతన ఒప్పందం ముగుస్తుందని, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఏప్రిల్‌ 1 నుంచి వేతనాలు పెంచుతూ మెరుగైన ఒప్పందం చేయాలని కోరారు. 8 గంటల పనికి స్త్రీ, పురుషుకలు రూ.360లు కనీస వేతనం ఇవ్వాలని కోరారు. బోనస్లు 8 నుంచి 20 శాతానికి పెంచాలని, కార్మికులు రెగ్యులర్‌గా 20 రోజులు పనిచేస్తే ఒకరోజు వేతనంతో కూడిన సెలవు మంజూరు చేయాలని కోరారు. మేస్త్రీ నియమించుకోవడానికి అనుమతి ఇవ్వాలని కోరారు. మేస్త్రీకి యాజమాన్యం ఇతర పనులు అప్పగించరాదని కోరారు. కార్మికుల అడ్మిషన్‌ సందర్భంగా ఏర్పడిన ఆధార్‌ తప్పులను యజమాన్యం సవరించాలని కోరారు. యూనిఫామ్‌ 4 జతలు ఇవ్వాలని కోరారు. డాక్టర్‌ను నియమించాలన్నారు. ఆగిపోయిన క్యాంటీన్‌ను తిరిగి ప్రారంభించాలని కోరారు. కార్మికులకు గతంలో ఉన్న సౌకర్యాలను యధావిధిగా కొనసాగించాలని కోరారు. బాయిలర్‌ హీట్‌ అలవెన్స్‌ ఇవ్వాలని కోఆరు. ఈ డిమాండ్లను ఫ్యాక్టరీ యాజమాన్యం యూనియన్‌ నాయకత్వంతో చర్చించాలని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement