ప్రకాశం జిల్లా ఎస్పీ మలిక గర్గ్ ఆదేశాల మేరకు కందుకూరు డిఎస్పీ కె.శ్రీనివాసరావు ఉత్తర్వుల ప్రకారం సిఐ కనిగిరి బి.పాపారావు పర్యవేక్షణలో కనిగిరి, వెలిగండ్ల, పీసీ పల్లి ఎస్సైలు 7 గంటల వ్యవధిలో అపహరణకు గురైన బాలుడి ఆచూకీ కనిపెట్టారు. జయంపు దుర్గా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు కిడ్నాప్ నకు గురైన జయంపు వంశి కుమార్ (9 నెలలు) గుర్తించారు. జయంపు సుధ, చేవూరి ప్రేమలత, దొంతుబోయిన గోపిరెడ్డి బాలున్ని అపహరించుకు పోయారు. ఈనెల 9వ తేదీ తేది మధ్యాహ్నం సుమారు 3.30 గంటల సమయంలో కనిగిరి పట్టణంలోని కాశిరెడ్డి కాలనీలోని జయంబు దుర్గా రెండవ కుమారుడు అయిన జయంబు వంశి కుమార్ అను 9 నెలల బాలుడిని కిడ్నాప్ చేసి తీసుకొని పోయినట్లుగా, సాయంత్రం సుమారు 6.30 గంటల సమయంలో కనిగిరి పోలీస్ స్టేషన్ లో రిపోర్టు రాగా, సదరు రిపోర్టుపై కేసు నమోదు చేశారు. అంతట ప్రకాశం జిల్లా మలిక గర్గ్ ఆదేశాల మేరకు ఆమె ఎప్పటికప్పుడు ఇస్తున్న సూచనల మేరకు కందుకూరు డీఎస్పీ కండే శ్రీనివాసులు పర్యవేక్షణలో కనిగిరి సీఐ, కనిగిరి ఎస్ఐ, వెలిగండ్ల ఎస్ఐ, పీసీ పల్లి ఎస్ఐని వారి సిబ్బందితో పాటు బృందాలుగా ఏర్పరిచి, ప్రకాశం జిల్లాలోని ఐటీ కోర్ టీం వారి సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో బాలుని ఆచూకీ నిమిత్తం వెతుకుచుండగా గుంటూరు జిల్లా అమరావతి దగ్గరలో గల నెమలికల్లు గ్రామంలో బాలుని ఆచూకి తెలుసుకొని బాలున్ని రాత్రి కొన్ని గంటల సమయంలో చేధించి, బాలుడిని స్వాధీన పరుచుకోవడమైనది.
ఈ నేరంలో కనిగిరి టౌన్ లోని కాశిరెడ్డి కాలనీ నందు నివాసముంటున్న జయంపు సుధ అను ఆమెకు 5 మంది పిల్లలు అయినట్లు, ఫ్యామిలీతో దూరంగా గుంటూరుకు చెందిన గోపిరెడ్డితో సుమారు 3 సంవత్సరాల నుండి కలిసి ఉంటున్నట్లు, వీరిద్దరికీ పిల్లలు లేనందున కనిగిరి టౌన్ లోని కాశిరెడ్డి కాలనీకి చెందిన చెవూరి ప్రేమలతతో కలిసి ముగ్గురు ప్లాన్ చేసుకొని 9వ తేదీన వంశి కుమార్ ను కిడ్నాప్ చేసి పెంచుకోవడానికి తీసుకొని వెళ్ళినారు. బాలుడు క్షేమంగానే వున్నాడు. బాలుని కిడ్నాప్ నకు సంబంధించిన జయంపు సుధ, చేవూరి ప్రేమలత, దొంతిబోయిన గోపిరెడ్డి, అను వారిని అరెస్టు చేసి రిమాండ్ కు పంపించారు. ముద్దాయిలను గుర్తించి అరెస్టు చేసిన కందుకూరు డిఎస్పి కె.శ్రీనివాసరావు, కనిగిరి సిఐ పాపారావు, కనిగిరి ఎస్సై జి.రామిరెడ్డి, పి.సి.పల్లి ఎస్సై ప్రేమే కుమార్, వెలిగండ్ల ఎస్సై రాజ్ కుమార్, సిబ్బందిని ప్రకాశం జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.