Friday, November 22, 2024

పి.ఆర్ ఉద్యోగులు..

మార్కాపురం‌ : ప్రభుత్వ సచివాలయాలలో పనిచేస్తున్న గ్రేడ్‌ 1 నుండి గ్రేడ్‌ 5 పంచాయితీ కార్యదర్శులకు డిడిఓగా యంపిడిఓను, గ్రేడ్‌ 6 పంచాయితీ కార్యదర్శులతో పాటు మిగిలిన ఉద్యోగులకు డిడిఓగా విఆర్‌ఓను ప్రభుత్వం నియమించిందని అలా కాకుండా పి.ఆర్‌ ఉద్యోగులకు డిడిఓగా పంచాయితీ కార్యదర్శినే ఉంచాలని పి.ఆర్‌ ఉద్యోగులు డిమాండ్‌ చేశారు. ఈ విధానం వలన గ్రేడ్‌ 6 కార్యదర్శులు పంచాయితీరాజ్‌, రెవిన్యూ అధికారుల మధ్య నలిగిపోవాల్సి వస్తుందని, కానీ పంచాయితీరాజ్‌, గ్రామీణాభివృద్ది శాఖకు చెందిన వారంతా తాము అలాగే పంచాయితీ కార్యదర్శి గ్రేడ్‌ 5 వారు కూడా డిఎస్సీ ద్వారా జిల్లా పంచాయితీ ఆఫీసర్‌ ద్వారా నియమించబడ్డామని తెలిపారు. కానీ వారిని మాత్రం పంచాయితీ రాజ్‌ డిపార్ట్‌మెంట్‌ కు చెందిన పంచాయితీ కార్యదర్శి వారికి డిడిఓగా ఉంచి తమకు మాత్రం రెవిన్యూ డిపార్ట్‌మెంట్‌కు చెందిన విఆర్‌ఓను డిడిఓగా ఉంచారని, ఇలా చేయడం సరైంది కాదన్నారు. ఒకే డిపార్ట్‌మెంట్‌కు చెందిన తమను ఇలా వేరు చేయడం సరికాదని, కావున తమకు డిడిఓలుగా విఆర్‌ఓలు కాకుండా పంచాయితీ కార్యదర్శి గ్రేడ్‌ 6లాగా తమను కూడా పంచాయితీరాజ్‌కు సంబందించిన ంచ పంచాయితీ కార్యదర్శినే డిడిఓగా నియమించాలని వారు కోరారు.ఈ కార్యక్రమంలో వివిధ సచివాలయాల డి.ఏలు, సెక్రటరీ గ్రేడ్‌6 వారు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement