Tuesday, November 26, 2024

విజయవంతంగా తొలి ఆర్థొ ఆపరేషన్

కందుకూరు : కందుకూరు ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో తొలిసారిగా విరిగిన ఎముకకు విజయవంతంగా ఆపరేషన్‌ నిర్వహించారు. పేరుకు నూరు పడకల ప్రభుత్వ ఆసుపత్రి అయినా కొంత కాలం క్రితం వరకు అక్కడి ఏర్పాట్లు నామమాత్రమేనని చెప్పాలి. అయితే గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో హాస్పిటల్‌ అభివృద్ధి కమిటీ ఛైర్మన్‌గా పిడికిటి వెంకటేశ్వర్లును నియమించిన తరువాత అక్కడ గణీయమైన మార్పులు జరిగాయి. చేపట్టిన బాధ్యత పట్ల ఎంతో నిబద్ధత కలిగిన పి డికిటి వెంకటేశ్వర్లు నూరు పడకల ప్రభుత్వ ఆసుపత్రికి జవసత్వాలు కల్పించడం కోసం చిత్తశుద్ధితో కృషిచేశారు. ఖరీదైన వైద్యం భరించలేని పేద, మద్య తరగతి ప్రజలకు ప్రభుత్వ ఏరియా వైద్యశాల పై నమ్మకం కలిగేలా గట్టిగా శ్రమించారు. స్వచ్ఛ భారత్‌ నినాదాన్ని ఆదర్శంగా తీసుకున్న పిడికిటి వెంకటేశ్వర్లు ప్రభుత్వ ఆసుపత్రులు ఇంత శుభ్రంగా ఉంటాయా అన్న ప్రశంసలను సాధించే రీతిగా ఏరియా హాస్పిటల్‌ను పరిశుభ్రంగా తీర్చి దిద్దారు. నిండు చూలాలుకు ప్రసవం జరగాలంటే సిజరిన్‌ ఆపరేషన్‌ తప్ప సుఖ ప్రసవం అనేది పట్టణంలోని ఏ ప్రైవేటు హాస్పిటల్స్‌లోనూ మచ్చుకైనా కనపడని పరిస్థితి. అందుకు భిన్నంగా సుఖ ప్రసవాలు కందుకూరు ఏరియా వైద్యశాలలోనే సంభవం అని పిడికిటి వెంకటేశ్వర్లు చేతలతో నిరూపించారు. దాని ఫలితంగా ఏరియా వైద్యశాలకు ఓ మంచి గుర్తింపు వచ్చింది. పలువురు డోనర్లు ముందుకు వచచి హస్పిటల్‌కు అవసరమైన ఏర్పాట్లకు సహకరించారు. కార్పోరేట్‌ హాస్పిటల్‌కు తీసిపోని రీతిలో ఏరియా వైద్యశాలను తిర్చదిద్దే గట్టి ప్రయత్నం పిడికిటి వెంకటేశ్వర్లు చేశారు. ప్రభుత్వం మారిన తరువాత కూడా ఎమ్మెల్యే మహీధర్‌ రెడ్డి ఆ పరంపరను కొనసాగించారు. ఏరియా వైద్యశాలలపై సామాన్యులలో ఉండే చిన్న చూపు పోగొట్టాలని ఎమ్మెల్యే మహీధర్‌ రెడ్డి కృతనిశ్చయం తీసుకున్నారు. ఇతర ఆపరేషన్లు కూడా విజయవంతంగా చేయగలగాలని డాక్టర్లను ప్రోత్సహించారు. అందుకు అవసరమైన సహకరించారు. ఆ ప్రోత్సాహ ఫలితంగానే శనివారం శల్య శస్త్ర చికిత్సను అక్కడి వైద్యులు విజయవంతంగా నిర్వహించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement