Tuesday, November 26, 2024

వినూత్న సంక్షేమ పథకాల రూపకర్త ఎన్టీఆర్ : టీడీపీ నేత జనార్దన్

చీరాల (ప్రభ న్యూస్) : ఆంధ్ర రాష్ట్రంలో పేద ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేసిన ఘనత తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావుకే చెందుతుoదని ఆ పార్టీ సీనియర్ నాయకులు కౌతవరపు జనార్దన్ పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ 41వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బుధవారం పార్టీ నియోజకవర్గం ఇన్ చార్జి కొండయ్య ఆధ్వర్యంలో పట్టణంలోని బస్టాండ్ సెంటర్ లోని ఎన్టీఆర్ విగ్రహానికి పుష్పమాల వేసి నివాళి అర్పించారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ 1982లో తెలుగుదేశం పార్టీ స్థాపించిన నాటి నుంచి నేటి వరకు ప్రజా సంక్షేమమే పార్టీ సంక్షేమంగా భావిస్తూ చక్కని పరిపాలన అందించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని కొనియాడారు. నిరుపేదలకు రెండు రూపాయల కిలో బియ్యం పథకం, పక్కా గృహాలు నిర్మాణంతో పాటు అన్న ఎన్టీఆర్ న్యాయబద్దమైన పరిపాలన చేశారని గుర్తు చేశారు. ఎన్టీఆర్ తన పాలనా కాలంలో ఎక్కడ వైఫల్యం చెందకుండా ప్రజల విశ్వాసాన్ని చూరగొన్నారని పేర్కొన్నారు. ముందుగా పార్టీ కార్యాలయంలో వద్ద పార్టీ జెండాను ఎగురవేశారు. అక్కడ నుంచి ర్యాలీగా పట్టణంలోని బస్టాండ్ సెంటర్ కు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళుల‌ర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు గజవల్లి శ్రీనివాసరావు, కొండ్రు రత్నబాబు, కొమ్మనబోయిన రజని, సుబ్బలక్ష్మి,తెల్లప్రోలు నాగేశ్వరావు, లావేటి శ్రీనివాస తేజ, పి. మస్తాన్, రత్నబాబు,నరాల తిరుపతి రాయుడు, పులిపాటి శేఖర్, మంగపతి తదితరులు ఉన్నారు.


హైదరాబాద్ వెళ్లిన టీడీపి ఇన్ చార్జి కొండయ్య..!
తెలుగుదేశం పార్టీ 41వ ఆవిర్భావ దినోత్సవ సభకు టీడీపీ ఇన్ చార్జి కొండయ్య హైదరాబాద్ వెళ్లారు. బుధవారం జరిగే సభకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ చెందిన నియోజకవర్గ ఎమ్మెల్యేలతో, ఇన్ చార్జిల‌తో, ముఖ్య నాయకులతో చంద్రబాబు ఆదేశాలు మేరకు హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో జరుగుతున్న సమావేశానికి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ చార్జి ఎంఎం కొండయ్య హాజరు అయ్యారని పార్టీ నాయకులు జనార్దన్ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement