కందుకూరు : కందుకూరు ఇన్చార్జి మండల విద్యాశాఖాధికారిగా బి.నాగేంద్ర వదన్ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు ప్రధానోపాధ్యాయుఉల, ఉపాధ్యాయులు, ఎంఇఓ కార్యాలయ సిబ్బంది, సిఆర్పీలు తదితరులు ఎంఇఓను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం మనబడి నాడు-నేడు గురించి పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఇఓ మాట్లాడుతూ నాడు-నేడు పనులను వేగవంతం చేయాలని సూచించారు. 25వ తేదీ నాటికి అన్నీ పనులు పూర్తిచేయాలని ప్రధానోపాధ్యాయులకు సూచించారు. అలాగే పాఠశాలలో విద్యార్ధుల వివరాలను, మధ్యాహ్న భోజన పధకం వివరాలను మొబైల్ యాప్‌లలో ప్రతి రోజు విధిగా నమోదు చేయాలని సూచించారు. ఉపాధ్యాయులు సబ్జెక్టుల వారీగా బోధించాలన్నారు. ఈ కార్యక్రమంలో మాచవరం హైస్కూలు ప్రధానోపాధ్యాయులు జి.మాల్యాద్రి, మోడల్ స్కూలు ప్రిన్సిపాల్ రమణయ్య, కెజిబివి ఎస్ఓ స్వాతి, ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement