ఉలవపాడు : సచివాలయానికి సిబ్బంది సమయానికి వచ్చారా లేదా అని ఎంపిడిఓ రవికుమార్ ఉలవపాడు మండలం చాగొల్లు సచివాలయాన్ని ఆయన తనిఖీచేశారు. అలాగే అక్కడ జరుగుతున్న కోవిడ్ టీకా వేస్తున్న తీరునుకూడా పరీక్షించారు. అలాగే మలివిడత కరోనా వ్యాప్తిపై ప్రజలకు ఆయన అవగాహన కల్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కరోనా వచ్చి సంవత్సరం రోజులు అయిపోయిందని, ప్రతి ఒక్కరూ శానిటైజర్‌తో చేతులను శుభ్రంగా కడుక్కోవాలని, నోటికి మస్కును ధరించి బయటకు రావాలని ఆయన తెలిపారు. వయో వృద్ధులు, వృద్ధులు, దీర్ఘకాలికి రోగాలు ఉన్న వారు కూడా కరోనా వ్యాక్సిన్ టీకా కార్యక్రమంలో పాల్గొనాలని, ఎవరూ ఈ టీకా గురించి జరుగుతున్న పుకార్లను నమ్మవద్దని ఆయన తెలిపారు. టీకా వేయించుకున్న వారిని చూసి ప్రజలందరూ టీకా వేయించుకోవాలన్నారు. ఉలవపాడు మండలం కరేడు పంచాయితీ పరిధిలోని ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో 202 మంది కరోనా టీకాలు వేయించుకున్నారని, ఇంకా చాలా మంది వేయించుకోవాల్సి ఉందని, వారు కూడా కరోనా టీకాలను వేయించుకోవాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కె.శ్రీనివాసరావు, డాక్టర్ రాజ్యలక్ష్మి, చాగొల్లు సర్పంచ్ లేళ్ళపల్లి లతా చంద్రశేఖర్, చాగొల్లు కార్యదర్శి భాస్కర్, కరేడు పంచాయితీ కార్యదర్శి చక్రవర్తి, వైద్య ఆరోగ్య సిబ్బంది, సచివాలయ సిబ్బంది తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నరు.
Advertisement
తాజా వార్తలు
Advertisement