ఉలవపాడు : మండల కేంద్రమైన ఉలవపాడులో సిపిఐ కందుకూరు నియోజకవర్గ కార్యదర్శి పోకూరు మాలకొండయ్య అధ్యక్షతన రామయాపట్నం మేజర్ పోర్టు సాధన కోసం ఈ నెల 23న కందుకూరు ఆర్డీఓ కార్యాలయం వద్ద ఏర్పాటు చేయనున్న ధర్నా కార్యక్రమం పై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకునే చర్యల వల్ల ఎప్పటి నుంచో కందుకూరు నియోజకవర్గ పరిధిలో రామాయపట్నం పోర్టు సాధ్యమవుతుందని ఆశించిన ప్రజలకు నిరాశే మిగిలింది. ఇప్పుడు అన్నీ కంపెనీల ప్రైవేటుపరం చేస్తూ రామాయపట్నం మొడిచేయి చూపించే దిశగా అడుగులు వేస్తున్నారని వాటిని ఎండగట్టేందుకు ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు పార్టీలకు అతీతంగా కందుకూరు లోని ఆర్డీఓ కార్యాలయం వద్ద పార్టీలకు అతీతంగా దేశ శ్రేయస్సు కోరే ప్రజలందరి మద్దతుతో మహాధర్న నిర్వహిస్తున్నట్లు మాలకొండయ్య కోరారు. ఈ కార్యక్రమానికి కార్మిక, కర్షక, బడుగు, బలహీన చిరు వ్యాపార , ఉద్యోగ సంఘాలు అందరూ పాల్గొని జయప్రదం చేయాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ కందుకూరు నియోజకవర్గ కార్యదర్శి మాలకొండయ్య తోపాటు సిపిఎం జిల్లా సభ్యులు జి వెంకటేశ్వర్లు, ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు బూసి సురేష్‌బాబు, భీమ్ ఆర్మీ జిల్లా అధ్యక్షులు మాల్యాద్రి, సామాజిక కార్యకర్త వెంకటేశ్వర్లు, కందుకూరు నియోజకవర్గ సహాయ కార్యదర్శి షేక్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement