Sunday, September 8, 2024

మద్యం సీసాల పట్టివేత..

పొదిలి : పొదిలి ఎస్‌ఈబి సర్కిల్‌ పరిధిలోని కొనకనమిట్ల మండలం చినమనగుండం గ్రామంలో 370 తెలంగాణా మద్యం సీసాలను పొదిలి ఎస్‌ఈబి ఇన్‌స్పెక్టర్‌ వెంకట్రావు తన సిబ్బందితో పట్టుకున్నారు. ఈ సంధర్భంగా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గత కొంత కాలంగా లారీ డ్రైవర్‌ ముసుగులో పక్క రాష్ట్రాల నుండి అక్రమ మద్యం తీసుకువచ్చి అమ్మకాలు జరుపుతున్నారన్న సమాచారంతో చాకచక్యంగా నిందితున్ని పట్టుకున్నట్లు ఎస్‌ఈబి ఇయస్‌ ఆవులయ్య తెలిపారు. నిందితున్ని పట్టుకోవడంతో ప్రతిభ చూపిన ఇన్‌స్పెక్టర్‌ వెంకట్రావును ఈఎస్‌ ఆవులయ్య అభినందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement