Friday, November 22, 2024

వాకా మాల్యాద్రికి ఎన్నిక పత్రం

కందుకూరు : ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగులకు జీవోల ద్వారా భరోసా కల్పిస్తున్న సచివాలయ ఉద్యోగుల సంఘం నాయకుడు, ఆంధ్ర్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగులకు ఫెడరేషన్‌ ఛైర్మన్‌ కాకర్ల వెంకట రామిరెడ్డి ఆధ్వర్యంలో 72 సంఘాలతో ఏర్పాటయిన ఈ ఫెడరేషన్‌ ఉద్యోగులకు భరోసా, భద్రత ఇస్తుందని, ఒంగోలులో సంఘ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా ఛైర్మన్‌ వినుకొండ రాజారావు మాట్లాడుతూ ఫెడరేషన్‌ కందుకూరు తాలూకా అధ్యక్షులుగా బిసి సంక్షేమ శాఖలో పనిచేస్తున్న సీనియర్‌ నాయకుడైన వాకా మాల్యాద్రిని కందుకూరు తాలూకా అధ్యక్షులుగా ఎన్నిక చేశారు. కందుకూరు తాలూకా పరిధిలోని గుడ్లూరు, వలేటివారిపాలెం, లింగసముద్రం, పొన్నలూరు, కొండేపి, శింగరాయకొండ, ఉలవపాడు, కందుకూరు మండలాలకు చెందిన ఉద్యోగులకు భరోసా కల్పించాలనే లక్ష్యంతో వాకా మాల్యాద్రిని ఎన్నిక చేసినట్లు వినుకొండ రాజారావు తెలియజేశారు. ఫెడరేషన్‌ ద్వారా ఉద్యోగులకు భరోసా కల్పించాలని ఆయా ప్రాంతాల్లో ఉన్న ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని, ఆ ప్రాంతంలో అపరిష్కృతంగా ఉన్న సమస్యలను జిల్లా నాయకత్వం దృష్టిక తీసుకొని రావాలని ఉద్యోగులకు భరోసా కల్పించాలని ఫెడరేషన్‌ను పటిష్టం చేయాలని, వాకా మాల్యాద్రిని అభినందిస్తూ జిల్లా కార్యవర్గంతో కలిసి ఫెడరేషన్‌ విధి విధానాలకు అనుగుణంగా కార్యక్రమాలు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో నూతనంగా అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన కందుకూరు తాలూకా అధ్యక్షులు వాకా మాల్యాద్రి, ఫెడరేషన్‌ జిల్లా నాయకులు షేక్‌.రసూల్‌ బాషా, ఎండ్లూరి చిట్టిబాబు, పువ్వాడ శ్రీమన్నారాయణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement