Saturday, November 23, 2024

ఇంటిపన్నులు చెల్లించండి..

కందుకూరు : కందుకూరు పురపాలక సంఘ పరిధిలో బ కాయి ఉన్న ఇంటి పన్నులు మరియు నీటి కుళాయి పన్ను వసూలు నిమిత్తం మున్సిపల్‌ కమీషనర్‌ ఎస్‌.మనోహర్‌ పట్టణంలో పలు ఏరియాలలో పర్యటించారు. 2020-2021 ఆర్ధిక సంవత్సరము వరకు కందుకూరు పురపాలక సంఘమునకు చెల్లించవలసిని ఇంటిపన్నులు, ఖాళీ స్థలం పన్నులు మరియు నీటి కుళాయి చార్జీల బకాయి మొత్తమును వెంటనే చెల్లించవలసినదిగా పట్టణ ప్రజలకు మున్సిపల్‌ కమీషనర్‌ ఎస్‌.మనోహర్‌ తెలియజేశారు. గత రెండు సంవత్సరములకు పైగా పన్నులు బకాయిలు ఉన్న వారి ఇంటి నీటి కుళాయి కనెక్షన్లు తొలగించబడునని, అదే విధంగా బకాయి దారులకు రెడ్‌ నోటీసులు మరియు జప్లు నోటీసులు జారీచేయడం జరుగుతుందని తెలియజేశారు. కోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసులకు సంబంధించి నిబంధనల మేరకు పన్ను వసూలు చేయడానికి తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇప్పటికే ఆయా వార్డు సచివాలయాల పరిధిలో అడ్మినిస్ట్రేటివ్‌ సెక్రటరీల ఆధ్వర్యంలో పన్ను బకాయి దారులకు సంబంధించి నీటి కుళాయి కనెక్షన్ల ను తొలగించినట్లు ఆయన తెలియజేశారు. ఆదివారం కూడా కందుకూరు పురపాలక సంఘ కార్యాలయము నందు కౌంటర్‌ తెరవబడి ఉంటుందని, పట్టణ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఆదివారం కూడా పన్ను బకాయిలు వగైరా చెల్లించవలసినదిగా తెలియజేశారు. ఈ పన్ను వసూలు కార్యక్రమంలో మున్సిపల్‌ కమీషనర్‌తోపాటు రెవిన్యూ అధికారి కె.రాజు, వార్డు సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement