కందుకూరు : కందుకూరు పురపాలక సంఘమునకు చెల్లించవలసిన ఇంటి పన్నులు, ఖాళీ స్థలం పన్నులు మరియు నీటి కుళాయి చార్జీల బకాయి మొత్తంను వెంటనే చెల్లించవలసినదిగా పట్టణ ప్రజలకు మున్సిపల్ కమీషనర్ ఎస్.మనోహర్ తెలియజేశారు. పన్నులు బకాయిలు ఉన్న వారి ఇంటి నీటి కుళాయి కనెక్షన్లు తొలగించబడునని, అదే విధంగా బకాయి దారులకు రెడ్ నోటీసులు మరియు జప్తు నోటీసులు జారీచేయడం జరుగుతుందని తెలియజేశారు. ఇప్పటికే ఆయా వార్డు సచివాలయాలలోని సిబ్బంది పన్ను బకాయి దారులకు సంబంధించిన నీటి కుళాయి కనెక్షన్లను తొలగించి ఉన్నారని తెలియజేశారు. ప్రభుత్వ సెలవురోజు అయిన ఆదివారం మరియు సోమవారం కూడా కందుకూరు పురపాలక సంఘ కార్యాలయము నందు కౌంటర్ తెరవబడి ఉంటుందని పట్టణ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఆదివారం కూడా పన్ను బకాయిలు వగైరా చెల్లించవలసినదిగా ఆయన తెలియజేశారు. ఈ పన్ను వసూలు కార్యక్రమంలో రెవిన్యూ అధికారి కె.రాజు, వార్డు సచివాలయ సిబ్బంది, ఇతర కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొని పలు ఏరియాలలో పన్ను బకాయి దారుల ఇంటి నీటి కుళాయి కనెక్షన్లు తొలగించి ఉన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement