గిద్దలూరు, (ప్రభ న్యూస్): పాఠశాలలకు గైర్హాజరవుతూ విధులపట్ల నిర్లక్ష్యం వహించే ఉపాధ్యాయులపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా విద్యాశాఖ అధికారి బి.విజయభాస్కర్ హెచ్చరించారు. శుక్రవారం గిద్దలూరు మండలంలోని దిగువమెట్ట ప్రాధమిక పాఠశాలను ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. పాఠశాలలో ముగ్గురు ఉపాధ్యాయులు పనిచేస్తుండగా ఉదయం 9.25 గంటలకు ఒక్క ఉపాధ్యాయుడే హాజరయ్యాడు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు వేమయ్య సెలవుపెట్టకుండా గైరుహజరు కావడం, మరో ఉపాధ్యాయులు రవికుమారి ఆలస్యంగా పాఠశాలకు హాజరుకావడంపై డీఈవో ఆగ్రహం వ్యక్తం చేశారు.వీరిద్దరికి సంజాయిషి నోటీసులు జారీ చేశారు.
ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలి..
ఉపాధ్యాయులు సమయపాలన పాటిస్తూ విధులకు హాజరుకావాలని డీఈవో బి.విజయభాస్కర్ కోరారు. విద్యార్థులకు నాణ్యమైన చక్కని క్రమశిక్షణ కలిగిన విద్యను బోధించాలన్నారు. విధులకు హాజరుకావడంతో నిర్లక్ష్యం తగదని నిర్లక్ష్యంగా వ్యవహరించేవారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు…
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital