Sunday, November 24, 2024

రామాయపట్నంలో భారీ నౌకాశ్రయం నిర్మించాలి..

కందుకూరు : ఆంధ్రప్రదేవ్‌ పునర్విభజన చట్టంలో పేర్కొన్న విధంగా కేంద్ర ప్రభుత్వం కందుకూరు నియోజకవర్గంలోని రామయాపట్నంలో భారీ నౌకాశ్రయం (ఓడరేవు) నిర్మించాలని కందుకూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ దివి శివరాం కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. కందుకూరు పట్టణంలోని స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నటువంటి కందుకూరు నియోజకవర్గంలోని రామాయపట్నం భారీ నౌకాశ్రయం నిర్మించడం ద్వారా అనేక పరిశ్రమలు వస్తాయని తద్వారా నిరుద్యోగులకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభించడంతోపాటుగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందడానికి అవకాశాలు మెండుగా ఉంటాయని శివారం అన్నారు. ఈ నెల 22వ తేదీ సోమవారం ఉదయం 10.00 గంటలకు కందుకూరు ఆర్డీఓ ఆఫీసు ముందు పార్టీలకతీతంగా ప్రాంతీయ అభివృద్ధి కోసం జరిగే ఈ ఉద్యమంలో కందుకూరు నియోజకవర్గంలోని ప్రజలందరూ పెద్ద ఎత్తున ధర్నాకు హాజరై కేంద్ర ప్రభుత్వానికి నిరసన తెలియజేయడం ద్వారా భారీ ఓడరేవు సాధించుకోవచ్చని ప్రజలకు శివరాం పిలుపునిచ్చారు. రామాయపట్నం పోర్టు సాధన కమిటీ కన్వీనర్‌ బి.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను తుంగలో తొక్కకుండా వెనుకబడిన ప్రాంతం అయినటువంటి కందుకూరు నియోజకవర్గంతోపాటు ప్రకాశం జిల్లా అభివృద్ధి చెందాలంటే రామాయపట్నం భారీ నౌకాశ్రయం ఏర్పాటుచేయవలసిని అవసరం, ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. సిపిఐ కందుకూరు నియోజకవర్గ కార్యదర్శి పోకూరి మాలకొండయ్య మాట్లాడుతూ కేంద్ర ంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరణ చేయడం ద్వారా ఎస్సీ, ఎస్టీ, బిసి లకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దూరమయ్యే ప్రమాదం ఉందని తద్వారా నిరుద్యోగ సమస్య అధికమవుతుందన్నారు. ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ ఎస్సీ సెల్‌ జిల్లా కార్యదర్శి గోచిపాతల మోషే, సిపిఎం కందుకూరు నియోజకవర్గ నాయకులు జివిబి కుమార్‌, ఎఐటియుసి జిల్లా అధ్యక్షులు బూసి సురేష్‌ బాబు, భీమ్‌ ఆర్మీ జిల్లా అధ్యక్షులు కసుకుర్తి మాల్యాద్రి, సామాజికి వేత్త పాలేటి కోటేశ్వరరావు, బాలకోటయ్య, వీరబాబు, నలమోతు శ్రీహరి, చిలకపాటి మధు, పిన్నమరాజు ప్రభాకరరావు, మన్నం రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement