మార్కాపురం : యువజన సంఘాలను ఏర్పాటు చేసుకోవడం వలన యువతీ యువకులలో క్రమశిక్షణ అలవరుతుందని ఐటిడిఏ డివిజన స్పెషల్ ఆఫీసర్ రామకృష్ణ తెలిపారు. నెహ్రూ యువకేంద్రం ఆధ్వర్యంలో జడ్‌పి ఉన్నత పాఠశాలలో యువతీ,యువకులకు వాలంటీర్లకు వైసిడిసిపి యూత్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాంపై అవగాహన కల్పించారు. ఈ సంధర్భంగా నెహ్రూయువకేంద్రం కో ఆర్డినేటర్ కమల్ నెహ్రూయువకేంద్రం, యూత్‌క్లబ్ స్థాపన ఆవశ్యకతను వివరించారు. ఐటిడిఏ ఆఫీసర్ రామకృష్ణ మాట్లాడుతూ ప్రతీ ఒక్కరు సమాజంపట్ల ఎలా మెలగాలో నేర్చుకోవాలని, యూత్‌క్లబ్ స్థాపన, కోవిడ్ వ్యాక్సినేషన్‌పై అవగాహనకల్పించారు. మార్కాపురం నెహ్రూయువకేంద్రం నామినీ కాళంరాజు రామకృష్ణ మాట్లాడుతూ గ్రామ, గ్రామాన, పట్టణాలలో యువజన సంఘాలు, యువజన సంఘాల ఏర్పాటు వలన వాటికి జరిగే మేలును వివరి ంచారు. యూత్‌క్లబ్‌లో చేరడం వలన కలిగే మేలును గురించి వివరించారు. జడ్‌పి బాలుర పాఠశాల హెచ్‌యం మునగాల చంద్రశేఖరరెడ్డి మాట్లాడుతూ యువజన సంఘాలు వాటి పట్ల మెరుగైన సమాచారం తెలియజేసి కోవిడ్ సెకండ్ వేవ్‌లో భాగంగా అందరూ వ్యాక్సిన్ చేయించుకోవాలని, మాస్కు తప్పక ధరించి భౌతికదూరం పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎన్‌వైఎస్ వారికి ఎన్‌వైకె మార్కాపురం బ్లాక్ వాలంటీర్ సముద్రాల పవన్‌కుమార్ ధన్యవాదాలు తెలిపారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement