యర్రగొండపాలెం : నేడు మానవసంబంధాలు దెబ్బతిని సమాజం గాడితప్పుతోందని యర్రగొండపాలెం విద్యాశాఖాధికారి పి.ఆంజనేయులు అన్నారు. స్థానిక ఉన్నత పాఠశాలలో ప్రముఖ కవి దేవులపల్లి విశ్వనాధం రచించిన ప్రేమదీపం పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమానికి చైతన్య ఉన్నత పాఠశాల వ్యవస్థపకులు టి.వీరాచారి అధ్యక్షత వహించారు. ఈ సంధరర్భంగా యంఈఓ ఆంజనేయులు మాట్లాడుతూ కవిత్వం సమాజాన్ని మేల్కొలిపేదిగా ఉండాలని, కవులు , కళాకారులు సమాజహితం కోసం రచనలు చేయాలన్నారు. ప్రస్తుతం పుస్తక పఠణం తగ్గిపోయిందని, టెక్నాలజీ పెరగడం మానవసమాజాన్నిఛిన్నాబిన్నం చేస్తోందన్నారు.విశ్వనాధం లాంటి కవులు అరుదుగా ఉంటారని, సమాజంపట్ల, దేశం పట్ల ఆయనకు ఉన్న నిబద్దత, ప్రేమ దేవులపల్లి వారి రచనలో కనిపిస్తాయన్నారు. 27 కు పైగా పుస్తకాలు రచించడం సామాన్యమై విషయం కాదని కవులను ఆదరించి ప్రోత్సహిస్తున్న దేశం సుభిక్షం అవుతుందన్నారు. రచయిత దేవులపల్లి విశ్వనాధం మాట్లాడుతూ నేటి సమాజపోకడలు ఆవేదనకు గురిచేస్తున్నాయని, పాఠ్యాంశాల్లో పిల్లలకు మానవ సంబంధాలు, విలువలు వంటి అంశాలపై పాఠాలను ముద్రించాలని కోరారు. సమాజ హితం కోసం కవులు పనిచేస్తుంటే ప్రభుత్వాలు వారికి తగిన గుర్తింపు, ప్రోత్సాహం ఇవ్వడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో ముందుగా దేవులపల్లి విశ్వనాధం రచించిన ప్రేమదీపం పుస్తకాన్ని కవి దిట్టకవి శ్రీనివాసాచార్యులు, గుర్రం చిన్నసుబ్బయ్యలు పుస్తక సమీక్ష నిరవహించారు. మోడల్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ శ్రీధర్‌నాయుడు, ఆర్ నరసింహశాస్త్రిలు పాల్గొని విశ్వనాధంను యంఈఓ ఆంజనేయులు, టివీచారి, బ్రాహ్మణ సేవాసంఘం పలువురు ప్రముఖులు నానా నాగేశ్వరరావు, జ్యోతి వరప్రసాదరావు, జి.శేషయ్య, బడేసాహెబ్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement