కరోనా వైరస్ రోజురోజుకు పెరుగుతూనే ఉంది. పేద, ధనిక అనే తేడా లేకుండా కరోనా మహమ్మారి అందరినీ భయపెట్టిస్తోంది. ఏపీలో కరోనా కేసుల తీవ్రత రోజు రోజుకు పెరుగుతూనే వుంది. తాజాగా ఒంగోలు రిమ్స్ మెడికల్ కళాశాలలో కరోనా కలకలం రేపుతోంది. 20 మందికి పైగా మొదటి సంవత్సరం మెడికల్ విద్యార్థులకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో మిగిలిన విద్యార్దులు, అధ్యాపకులు ఆందోళనకు గురవుతున్నారు. మొదటి సంవత్సరంలో మొత్తం 120 మంది విద్యార్థులు వున్నారు. విద్యార్థులకు కరోనా రావడంతో కొంతమందిని హోం ఐసోలేషన్ కు తరలించారు అధికారులు. మరికొంత మందికి రిమ్స్ లోనే చికిత్స అందిస్తున్నారు. అయితే మరో నాలుగు రోజుల్లో పరీక్షలు ఉండటంతో విద్యార్థుల్లో ఆందోళన నెలకొంది. పరీక్షలు వాయిదా వేయాలని విద్యార్ధులు యూనివర్సిటీ అధికారులను కోరుతున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..