మార్కాపురం: కోవిడ్ 2వ దశపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ అధికారులకు సూచించారు. పట్టణంలోని డ్వాక్రాభవన్‌లో కోవిడ్ 19 నియంత్రణ మరియు కోవిడ్ వ్యాక్సిన్ వేగవంతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై రెవిన్యూ వైద్యారోగ్య, పంచాయితీరాజ్, మున్సిపల్ శాఖాధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సంధరర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కరోనా 2వ దశ వైరస్ వ్యాప్తి చెందుతున్నందున క్షేత్రస్థాయిలో అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు.2వ దశ పర్యవేక్షణకు ప్రత్యేకాధికారులను నియమించడం జరిగిందని తెలిపారు. గ్రామ స్థాయిలో కంటైన్మెంట్ జోనలుగాప్రకటించేందుకు పంచాయితీ కార్యదర్శి, విఆర్‌ఓ, మండల తహసీల్దార్ కు నివేదిక పంపించాలని తెలిపారు. ఈ నివేదికల ఆధారంగా కంటైన్‌మెంట్ జోన్లను ప్రకటించాలన్నారు. వాలంటీర్లు ప్రతీ ఇల్లు తిరిగి ప్రజల ద్వారా సమాచారం తెలుసుకోవాలన్నారు. పెళ్లి, ఇతర ఉత్సవాలు జరుపుకునే సంధర్భాలలో మాస్కు ధరించడం, సామాజిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలన్నారు. చదువుల కోసం , పనుల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లి వచ్చిన వారికి కోవిడ్ పరీక్షలు తప్పక నిర్వహించాలన్నారు. ఒకవేళ వారికి పాజిటివ్ నిర్థారణ అయితే హోమ్ ఐసోలేషన్లో 14 రోజులు ఉంచాలని, పాజిటివ్ కేసుల్లో ఆరోగ్య తీవ్రతను బట్టి వైద్యశాలకు సిఫార్సు చేయాలన్నారు. హోం ఐసోలేషన్‌లో ఉన్న వారిని ఆరోగ్యకార్యకర్తలు తప్పక పరిశీలించాలన్నారు. 45 – 60 సం.ల లోపు వయసు వారికి కోవిడ్ వ్యాక్సిన్ ఇవ్వాలని తెలిపారు. ప్రజలందరికి కోవిడ్ వ్యాక్సిన్ క్షేత్రస్థాయిలో అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ టిఎస్ చేతన్, జిల్లా పంచాయితీ అధికారి జి.వి నారాయణరెడ్డి, జడ్‌పి సిఈఓ కైలాష్ గిరీశ్వర్, డిఈఓ సుబ్బారావు, ఆర్‌డిఓ యం.శేషిరెడ్డి, డిపిఓ జి.నాగేశ్వరరావు, డిఎల్‌డిఓ బివిఎన్ సాయికుమార్, డిడియంహెచ్‌ఓ డా. కె.పద్మావతి, కమీషనర్ నయీమ్ అహ్మద్, తహసీల్దార్ విద్యాసాగరుడు తదితరులు పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement