మార్కాపురం: గత పాలకుల మాదిరిగా కాకుండా మార్కాపురం పట్టణాన్ని స్వచ్చ మార్కాపురంగా మార్చడమే ధ్యేయంగా కౌన్సిల్ సభ్యులు పనిచేయాలని మున్సిపల్ చైర్మన్ చిర్లంచర్ల బాలమురళీకృష్ణ కోరారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో గల అమరజీవి పొట్టిశ్రీరాములు కౌన్సిల్ సమావేశ మందిరంలో జరిగిన కౌన్సిల్ అత్యవసర సమావేశంలో ఆయన మాట్లాడుతూ మార్కాపురం పట్టణంలో శానిటేషన్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని శానిటేషన్‌పె తమ కౌన్సిల్ ప్రత్యేక దృష్టిసారించిందని వెల్లడించారు. మున్సిపల్ కార్యాలయంలో 207 మంది శానిటేషన్ సిబ్బంది ఉన్నారని వీరిలో 18 మంది శాశ్వత ఉద్యోగులు కాగా మిగిలిన వారు కాంట్రాక్టు ఉద్యోగులుగా విధులు నిర్వహిస్తున్నారని, కాంట్రాక్టు ఉద్యోగులలో 141 మందిని పట్టణంలోని 21 సచివాలయాలకు కేటాయించడం జరిగిందని, సచివాలయ సిబ్బంది ఆధ్వర్యంలో శానిటేషన్ సిబ్బంది ఆయా సచివాలయాల పరిధిలో విధులు నిర్వహించడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. శానిటేషన్ సిబ్బంది కొరతను దృష్టిలో ఉంచుకుని మరో 50 మందిని నూతనంగా తీసుకునేందుకు దృష్టిసారించడం జరిగిందని, శానిటేషన్ సిబ్బంది సచివాలయాల పరిధిలో విధులు నిర్వహించే సంధర్భాలలో ఆ సచివాలయాల వార్డు కౌన్సిలర్లు సెతం దృష్టిసారి స్తే వారి వార్డులలో శానిటేషన్ ఇబ్బంది తలెత్తదని ఇకనుండి కౌన్సిలర్లందరూ ఆ దిశగా అడుగులు వేయాలని ఆయన కోరారు. పట్టణంలోని 35 వార్డులలో 20 సచివాలయాలు ఉన్నాయని, 21వ సచివాలయాన్ని మున్సిపల్ కార్యాలయంలోనే ఏర్పాటు చేసి ప్రతీ సోమవారం ఆ సచివాలయంలో 35 వార్డుల ప్రజా సమస్యలను వెల్లడించేందుకు ఫిర్యాదుల విభాగం ఏర్పాటు చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఫిర్యాదుల విభాగంలో వచ్చిన సమస్యలను వారం రోజులలో పూర్తి చేసేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన సూచించారు. మార్కాపురం పట్టణంలో పూలసుబ్బయ్య కాలనీ, జవహంనగం కాలనీలలో మాత్రమే అర్బన్ హెల్త్ సెంటర్లు ఉన్నాయని, పట్టణ ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఎమ్మెల్యే నాగార్జునరెడ్డి స్థానిక ఆం డిఓ కార్యాలయంలో మరో అర్బన్ హెల్త్ సెంటం ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారని త్వరలోనే అర్బన్ హెల్త్ సెంటం ను ఏర్పాటు చేయడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. పట్టణంలోని వార్డులలో కంటే తన వార్డులో సమస్యలు ఎక్కువగా ఉన్నాయని ఇప్పటికీ చాలా ప్రాంతాలలో రోడ్లు, డ్రైనేజీలు సెతం ఏర్పాటు చేయలేదని, సాగం నీటి సౌకర్యం కూడా లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, తన వార్డుపె ప్రత్యేక దృష్టిసారించాలని వైస్ చైర్మన్ షేక. ఇస్మాయిల్ కోరారు.ఇటీవల కాలంలో తన వార్డులో డెంగ్యూ కేసు సెతం నమోదైందని అధికారులు దృష్టిసారించి శానిటేషన్‌పె ప్రత్యేక దృష్టిసారించాలని ఆయన కోరారు. రోడ్లు, కాలువలు, డ్రైనేజీ సమస్యలపె నూతనంగా ఎన్నికైన పలువురు కౌన్సిలర్లు గళం విప్పారు. తమ వార్డులలో నెలకొన్న సమస్యలను తరితగతిన పూర్తి చేసేలా అధికారులు దృష్టిసారించి ప్రజలు మాపె ఉంచుకున్న నమ్మకాన్ని వమ్ముచేయకుండా చూడాలని పలువురు కౌన్సిలర్లు కోరారు. సమస్యలు పరిష్కరించే విధంగా కౌన్సిలర్లు పనిచేయండి : ఎమ్మెల్యే నాగార్జునరెడ్డి 35 వార్డులలో గెలుపొందిన కౌన్సిలర్లు ఆయా వార్డులలో నెలకొన్న సమస్యలు పరిష్కరించే విధంగా కృషి చేయాలని ఎమ్మెల్యే కుందురు నాగార్జునరెడ్డి సూచించారు. మున్సిపల్ కౌన్సిల్ అత్యవసర సమావేశానికి ముఖ్య అతిధిగా హాజరైన ఆయన మాట్లాడుతూ వార్డులలో తమ సమస్యలను దగ్గరుండి పరిష్కరిస్తారన్న నమ్మకంతోనే ప్రజలు మీపె నమ్మకంతో మిమ్మల్ని గెలిపించారని వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా కృషి చేయాల్సిన బాధ్యత మీపె ఉందని సూచించారు. ముందుగా నూతనంగా ఎన్నికైన కౌన్సిలర్లందరూ మున్సిపల్ కార్యాలయంలో ఏయే విభాగాలున్నాయో, ఏయే విభాగాలలో ఏయే పనులు చేయించుకోవచ్చో తెలుసుకోవాలని అప్పుడే వార్డులలో ప్రజల సమస్యలు తీర్చేందుకు సులువుగా ఉంటుందని ఆ విధంగా కౌన్సిలర్లు నడుచుకోవాలని ఆయన సూచించారు. వార్డుల్లో పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకుని సమస్యలు తీర్చాలంటే మనం ఎక్కడికి వెళ్లాలి, ఏ విధంగా పనిచేయాలనే దానిపె ముందుగా మనకు అవగాహన ఉండాలని, అప్పుడే మీరు వార్డులలో నమ్మకాన్ని నిలుపుకున్నవారవుతారని ఆయన సూచించారు. మార్కాపురం పట్టణానికి మెడికల్ కళాశాల రావడం వరమని, ఇప్పటి వరకు వైద్యం కోసం మనం పక్క ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోందని, మెడికల్ కళాశాల పూర్తయితే ఇక ఆ సమస్యలు ఉండవని ఆయన సూచించారు. 2 కోట్ల రూపాయలతో టెండర్లు పిలిచి తరలో షాదీఖానాకు శంకుస్థాపన చేయడం జరుగుతుందని, రూ. 80లక్షలతో ఆండిఓ కార్యాలయ ఆవరణలో అర్బన్ హెల్త్ సెంటంను ఏర్పాటు చేయడం జరుగుతుందని, ఆండిఓ కార్యాలయంలో అర్బన్ హెల్త్ సెంటం ఏర్పాటు చేసేందుకు సహకరించిన జిల్లా కలెక్టం, ఆండిఓ, రెవిన్యూ సిబ్బందికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. పట్టణ ప్రజల తాగునీటి సమస్యలు తీర్చేందుకు 22కోట్ల 40 లక్షల రూపాయలతో ప్రతిపాదనలు పంపడం జరిగిందని, ప్రతిపాదనలు ఆమోదమైన వెంటనే పట్టణంలో మిగిలిపోయిన 7 వార్డులలో సాగంపెప్‌లైన్ నిర్మాణంతో పాటు దూపాడు వద్ద 2వ పెప్‌లైన్ నిర్మాణం చేపట్టడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. కౌన్సిల్ సమావేశానికి మున్సిపల్ కమీషనం నయీమ్ అహ్మద, డి.ఇ సుభాని, మేనేజం శ్రీనివాస్‌లతో పాటు ఏఈలు, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement