ఉలవపాడు మండలం కరేడు ర్యాంపులోని పిటిపి ఫ్యాక్టరీ కార్మికులకు మెరుగైన నూతన వేతన ఒప్పందం అమలుచేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి జి.శ్రీనివాసులు పిలుపునిచ్చారు. వెంకటేశ్వర స్వామి గుడి వద్ద పిటిపి స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ జనరల్ బాడీ సమావేశం ఆ సంఘం అధ్యక్షుడు సవరం శ్రీనివాసులు అధ్యక్షతన జరిగింది. సమావేవంలో సిఐటియు జిల్లా కార్యదర్శి జి.శ్రీనివాసులు, ఆ సంఘం గౌరవ అధ్యక్షులు జివిబి కుమార్ పాల్గొని కార్మికులను ఉద్దేశించి మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విధానాల వలన నిత్యావసర వస్తువులు ధరలు, డిజిల్, పెట్రోల్ , గ్యాస్ ధరలు నియంత్రణ లేకుండా పెరుగుతన్నాయని పేర్కొన్నారు. పెరుగుతున్న ధరలతో కార్మికుల కుటుంబాలు గడవక తీవరమైన ఇబ్బందులు పడుతున్నారన్నారు. జిఓ నెం.23 ప్రకారం పిటిపి ఫ్యాక్టరీ కార్మికులకు ఆడ, మగ తేడా లేకుండా 8 గంటల పనికి రూ.360లు వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. 20 రోజులు కంటిన్యూగా పనిచేస్తే అదనంగా ఒకరోజు వేతనాన్ని ఇవ్వాలన్నారు. రూ.13 శాతం బోనస్ ఇవ్వాలన్నారు. డ్యూటీకి మేస్త్రీని నియమించాలని కోరారు. ఫ్యాక్టరీలో మేస్ ఏర్పాటుచేయాలని కోరారు. కార్మికులకు ఆధార్ కార్డుల సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరారు. ఈ సమస్యలను జనరల్ బాడీ సమావేశంలో చర్చించామని, కార్మికుల ఆమోదం తీసుకున్నామని యాజమాన్యానికి తర్వలోనే డిమాండ్ నోటీసు ఇవ్వాలని సమావేశం నిర్ణయించింది. ఈ సమావేశంలో యూనియన్ ఆఫీస్ బేరర్లు గంజి శ్రీనివాసులు, పిగిలి శ్రీనివాసులు, ఆర్.సుబ్బరామయ్య, వెంకటసుబ్బయ్య, షేక్.మస్తాన్బి, కె.మహేష్, చిలకా శ్రీనివాసులుతోపాటు ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు ఎస్ అరుణ్‌కుమార్ పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement