కందుకూరు : తగ్గినట్లే తగ్గి మళ్ళీ రెచ్చిపోతున్న కరోనా మహమ్మారి అంతు చూసేందుకు వాక్సినేషన్ ఒక వజ్రాయుధం అని ప్రకాశంజిల్లా కలెక్టర్ పోలాభాస్కర్ అభివర్ణించారు. వాక్సినేషన్ కార్యక్రమం గురించి నియోజకవర్గ స్థాయిలో సమీక్ష నిర్వహించడానికి ఆయన కందుకూరు వచ్చారు. వెంగమాంబ ఫంక్షన్ హాల్‌లో కందుకూరు, కొండపి, కనిగిరి, నియోజకవర్గ స్థాయి అధికారులతో కలెక్టర్ పోలా భాస్కర్ సమీక్ష నిర్వహించారు. కోవిడ్ నియంత్రణ కోసం అనుసరించాల్సిన ప్రణాళికను వివరించారు. వాక్సిన్ పట్ల ఉన్న అపోహలను తొలగించి, వాక్సినేషన్ కార్యక్రమం ముమ్మరం చేయాలని మార్గ నిర్దేశం చేశారు. జాయింట్ కలెక్టర్ చేతన్‌తోపాటు జెడ్‌పి సిఇఓ కైలాష్ గిరీశ్వర్, జిల్లా రెవిన్యూ అధికారి , జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి, జిల్లా విద్యాశాఖాధికారి, డిఎస్‌పి, ఎంపిడిఓలు, మున్సిపల్ కమీషనర్లు తదితర అధికారులు పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement