కందుకూరు టౌన్: బడి బయట పిల్ల సర్వేను పారదర్శకంగా నిర్వహించాలని కందుకూరు మండల విద్యాశాఖాధికారి బి.నాగేంద్ర వదన్ అన్నారు. స్థానిక ఎంపిడిఓ కార్యాలయ సమావేశ మందిరంలో మనబడికి పోదాం కార్యక్రమమునకు సంబంధించి ఎన్యుమరేటర్లకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ సర్వే శిక్షణా కార్యక్రమంలో ఎంఇఓ మాట్లాడుతూ బడి బయట పిల్లలు, ఇంకనూ బడిలో చేరని, బడికి సక్రమంగా రాని పిల్లల గురించి పట్టణంలోనూ, గ్రామాల్లోనూ వాలంటీర్లు, సచివాలయ విద్యా సహాయకులు, సిఆర్పీలు, ఇతర ఎన్యుమరేటర్లు అందరూ సర్వేను పకడ్బందీగా నిర్వహించాలన్నారు. ఈ నెల 23వ తేదీ నుంచి మన బడికి పోదాం కార్యక్రమం ద్వారా బడి బయట పిల్లలందరినీ గుర్తించి వారి వివరాలను ఎన్యుమరేటర్లు మొబైల్ యాప్లో నమోదు చేసి వారిని బడికి పంపించే ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రధానంగా ఇటుక బట్టీలు, హాటళ్ళు, సంచార జాతులకు చెందిన వారి పిల్లలు ఎక్కువగా బడిబయట ఉన్నారని, వారందరినీ తిరిగి పాఠశాలలో చేర్పించాల్సిన బాధ్యత ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మండలంలోని కాంప్లెక్స ఛైర్మన్లు డి.అనూరాధ, ద్వారకరాణి, జి.మాల్యాద్రి, ఎం.జాన్, మురళీ కృష్ణ, జి శ్రీనివాసరావు సర్వే గురించచి మాట్లాడారు.ఈ కార్యక్రమంలో కెజిబివీ ప్రత్యేకాధికారి స్వాతి, సిఆర్పీలు, వెల్ఫేర్ ఎడ్యుకేషనల్ అసిస్టెంట్లు, వార్డు సచివాలయ విద్యా సహాయకులు, పిటిఐలు తదితరులు పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement