Tuesday, November 26, 2024

ఒంగోలుకు వ‌చ్చిన సీఎం జ‌గ‌న్ కు ఘ‌న స్వాగ‌తం

వై.ఎస్.ఆర్. సున్నా వడ్డీ మూడో విడత పంపిణీ కార్యక్రమంలో పాల్గొనేందుకు జిల్లాకు వచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఒంగోలులో ఘన స్వాగతం లభించింది. పీవీఆర్ బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన మహిళా సాధికారత సభకు రాష్ట్ర ముఖ్యమంత్రి శుక్రవారం హాజరయ్యారు. స్థానిక ఏబీఎం పాఠశాల క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ కు ఉదయం 10:52 గంటలకే హెలికాఫ్టర్ లో సీఎం చేరుకున్నారు. ఉ 10:55 గంటలకు హెలికాఫ్టర్ నుంచి సీఎం కిందకు దిగారు. ముందుగా జిల్లా కలెక్టర్ ఏ.యస్.దినేష్ కుమార్ పుష్పగుచ్ఛంతో ఘనంగా ఆహ్వానం పలికారు. జిల్లా ఇంఛార్జి మంత్రి మేరుగ నాగార్జున, రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్, విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, పీ.ఆర్.రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, డిఐజి త్రివిక్రమ్ వర్మ, జిల్లా ఎస్పీ మలికాగర్గ్, జేసీ ఏం.అభిషిక్త్ కిషోర్, జడ్పీ ఛైర్ పర్సన్ బూచేపల్లి వెంకయమ్మ, ఎమ్మెల్సీలు తూమాటి మాధవరావు, పోతుల సునీత, ఒంగోలు శాసన సభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డిలు మర్యాదపూర్వకంగా ముఖ్యమంత్రిని కలిసి పుష్పగుచ్చాలతో అభినందనలు తెలిపారు.
ఏబీఎం ఉన్నత పాఠశాల హెలిప్యాడ్ వద్ద ఉదయం 11:23 గంటల వరకు విఐపీలతో పరిచయ కార్యక్రమం సాగింది. వీఐపీ గ్యాలరీలో కనిగిరి, దర్శి, గిద్దలూరు, మార్కాపురం, సంతనూతలపాడు, చీరాల శాసన సభ్యులు బుర్రా మధుసూదన్ యాదవ్, మద్దిశెట్టి వేణుగోపాల్, అన్నా వెంకట రాంబాబు, కుందుర్రు నాగార్జునరెడ్డి, టి.జె.ఆర్. సుధాకర్ బాబు, కరణం బలరాం కృష్ణమూర్తి, ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత, మాజీ మంత్రులు సిద్ధా రాఘవరావు, గాదె వెంకటరెడ్డి, మాదిగ కార్పొరేషన్ చైర్మన్ కె కనకారావు, పి డి సి సి బ్యాంక్ చైర్మన్ డాక్టర్ మాదాసి వెంకయ్య, మాజీ శాసనసభ్యులు జంకె వెంకట్ రెడ్డి, బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, బాచిన చెంచు గరటయ్య, మద్య విమోచన ప్రచార కమిటీ రాష్ట్ర ఛైర్మన్ వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డిలు పుష్పగుచ్ఛాలు అందజేశారు. తదుపరి మధ్యాహ్నం 01:52 గంటలకి హెలిప్యాడ్ కి చేరుకున్న ముఖ్యమంత్రి మధ్యాహ్నం 01:54 గంటలకు హెలికాప్టర్ ఎక్కగా, మధ్యాహ్న 01:59 గంటలకు ఒంగోలు నుంచి హెలికాఫ్టర్ బయలుదేరింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement