కందుకూరు : కందుకూరు మున్సిపాలిటీకి నియోజకవర్గంలోని పెరల్ డిస్టిలరీ కంపెనీ రూ.12 లక్షలు వితరణ ప్రకటించింది. మున్సిపాలిటీ పరిధిలో చెత్త సేకరణ కోసం అవసరమైన రెండు వాహనాలు సమకూర్చేందుకు అసవరమైన రూ.12 లక్షలను చెక్కు రూపంలో మున్సిపల్ కమీషనర్ ఎస్.మనోహర్‌కు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మహీధర్ రెడ్డి పాల్గొన్నారు.
సమస్యల సత్వర పరిష్కారం జరగాలి – ఎమ్మెల్యే మహీధర్ రెడ్డి…..
మున్సిపాలిటీ పరిధిలో సహేతుకమైన సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కందుకూరు ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి స్పష్టంచేశారు. ప్రజా విజ్ఞప్తుల పరిశీలన కోసం ఎమ్మెల్యే మహీధర్ రెడ్డి ప్రతి శనివారం మున్సిపల్ కార్యాలయంలో మకాం చేస్తున్నారు. అందులో భాగంగా శనివారం మున్సిపల్ కార్యాలయానికి విచ్చేసిన ఆయన ప్రజల నుండి విజ్ఞాపన పత్రాలను స్వీకరించి పరిశీలించారు. ఈ సందర్బంగా మాట్లాడిన ఆయన సమస్యల పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్యాన్ని సహించేది లేదని స్పష్టంచేశారు. మున్సిపల్ కమీషనర్ మనోహర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
పెరల్ డిస్టిలరి రూ.12 లక్షలు వితరణ..
Advertisement
తాజా వార్తలు
Advertisement