Saturday, November 23, 2024

సమ్మె విజయవంతం

కందుకూరు : కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను, బ్యాంకులను ప్రై వేటీకరించడాన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా జరుగుతున్న బ్యాంకు సమ్మెలో భాగంగా కందుకూరు పట్టణంలోని అన్నీ బ్యాంకుల నుండి ఉద్యోగులు, అధికారులు, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఎస్‌బిఐ మెయిన్‌ బ్రాంచ్‌ నుండి ఓవి రోడ్డు, పామూరు రోడ్డు, గవర్నమెంట్‌ హాస్పిటల్‌ రోడ్డు, అంకమ్మగుడి, ఎల్‌ఐసి ఆపీసు, కోవూరు రోడ్డు నుండి పోస్టాఫీసు సెంటర్‌ చేరుకుంది. పోస్టాఫీసు సెంటర్‌లో సభ నిర్వహించారు. ఈ సభను ఉద్దేశిచి రిటైర్డ్‌ బ్యాంకు ఉద్యోగి పిన్నంరాజు ప్రభాకర్‌ మాట్లాడుతూకేంద్రంలో మోడీ ప్రభుత్వం ప్రజల ప్రయోజనాలని పణంగా పెట్టి బ్యాంకు, ఎల్‌ఐసిలతోపాటు అన్నీ రంగాలను ప్రైవేటీకరణ చేస్తాం లేదా అమ్మేస్తాం అని చెప్పటం సిగ్గుచేటన్నారు. రాబోయే కాలంలో ప్రజలకు భీమా సౌకర్యం లేకుండా, బ్యాంకు సేవలు అందుబాటులో లేకుండా ప్రమాదముందని కావున బ్యాంకుల ప్రైవేటీకరణ విధానాలకు వ్యతిరేకంగా జరిగే ఉద్యమంలో ప్రజలంతా పాల్గొని పూర్తిస్థాయి మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ నిరసన కార్యక్రమంలో పాలు సామాజిక సంఘాల నాయకులు ప్రసంగించారు. అనంతరం పట్టణంలో భారీ బైక్‌ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాలేటీ కోటేశ్వరరావు, పి మాలకొండయ్య, సిపిఎం కందుకూరు పట్టణ కార్యదర్శి ఎస్‌ఎ గౌస్‌, సాదుచెన్నకేశవ, ఏఐటియుసి నాయులు ఎం సుబాను, బ్యాంకు ఉద్యోగ సంఘాల నాయకులు సాయి సురేష్‌, అశోక్‌, వలేటివారిపాలెం మండల నాయకులు నరేష్‌, చైతన్యకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement