కందుకూరు : ఉలవపాడు మండలం రామాయపట్నం వద్ద నౌకాశ్రయం నిర్మానానికి ప్రభుత్వం రగం సిద్ధం చేసింది. ప్రైవేటు కంపెనీలకు అప్పజెప్పి పోర్టు ఏర్పాటు చేయడానికి అన్నీ ఏర్పాట్లు చేస్తున్నారు. ముందు అనుకున్నంతగా కాకుండా కుదించి మైనార్ పోర్టుగా తీర్చిదిద్దనున్నారు. గుడ్లూరు మండలంలోని రెండు, మూడు పంచాయితీలకే పరిమితం చేసి పై భాగమంతా నెల్లూరు జిల్లా పరిధిలో నిర్మించేందుకు అధికారులు కసరత్తులు ప్రారంభించారు. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం తాము ఎక్కడ పోర్టు నిర్మించడంలేదని తేల్చి చెప్పడంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులకు పోర్టు నిర్మాణ బాధ్యతలను అప్పజెప్పారు. ఇందుకోసం జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ కందుకూరు సబ్‌కలెక్టర్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఆయన ఆకస్మికంగా వచ్చి సబ్ కలెక్టర్ భార్గవతేజ, గుడ్లూరు తహశీల్దారు శ్రీ శిల్పాతో సమావేశమయ్యారు. ప్రత్యేక కలెక్టర్ చేతన్ కూడా ఈ సమావేశానికి వచ్చారు. ఏయే ప్రాంతాలు పోర్టు పరిధిలోనికి వస్తాయో గుర్తించి ఆ ప్రాంతంలో భూ సేకరణ చేపట్టడానికి కలెక్టర్ స్వయంగా అధికారులతో సమావేశం కావడం జరిగింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement