ఉలవపాడు : కోవిడ్ – 19 వాక్సిన్‌ను ప్రతి ఒక్కరూ వేయించుకోవాలని ఎంపిడిఓ బి రవికుమార్ తెలిపారు. ఉలవపాడు మండలంలోని వీరేపల్లి, రామాయపట్నంలో అవగాహన సదస్సులను ఏర్పాటుచేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కోవిడ్-19 ప్రబలకుండా ప్రతి ఒక్కరూ వాక్సిన్ వేయించుకోవాలని, 45 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల వరకు ఉండి దీర్ఘ రోగాలతో బాధపడుతున్నవారు, వృద్దులు టీకా వేయించుకోవాలని ప్రజలకు ఆరోగ్య కార్యకర్తలు, ఆశా వర్కర్లు, సచివాలయ సిబ్బంది, వలంటీర్లు అవగాహన కల్పించాలని ఆయన తెలిపారు. అలాగే ఉలవపాడు మండలం చాకిచర్ల ఆరోగ్య కేంద్రంలో కోవిడ్ వాక్సిన్‌ను ఆయన పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రాజ్యలక్ష్మి, ఎంపిడిఓ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement