Monday, November 25, 2024

పేకాట రాయుళ్ళ అరెస్టు

కందుకూరు : కందుకూరు మండలంలోని ఓగూరు గ్రామ పొలాల్లో జరుగుతున్న పేకాట శిబిరంపై కందుకూరు రూరల్‌ పిఎస్‌ ఎస్సై తన సిబ్బందితో దాడిచేసి పేకాట ఆడుతున్న 16 మందిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి రూ.1,00,740లు నగదు మరియు పేకలు స్వాధీన పరచుకోవడం జరిగింది. వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎస్సై తెలిపారు.
–కందుకూరు స్పెషల్‌ ఎన్ఫోర్స్‌మెంట్‌ బ్యూరో అధికారుల దాడులు…….
– అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లు పట్టివేత…..
కందుకూరు స్పెషల్‌ ఎన్ఫోర్స్‌మెంట్‌ బ్యూరో అధికారులు వాహనాలు తనిఖీ నిర్వహించగా కందుకూరు రూరల్‌ మండలంలోని శ్రీరంగరాజు పాలెం గ్రామానికి చెందిన వాసుపల్లి అయ్యపరెడ్డి అను వ్యక్తి అక్రమంగా తరలిస్తున్న ఇసుకను ట్రాక్టర్‌తో సహా స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి అతనిని అరెస్టు చేసి తదుపరి చర్యల నిమిత్తం ముద్దాయిని మరియు ఇసుకతో సహా ట్రాక్టర్‌ని కందుకూరు టౌన్‌ పోలీసు స్టేషన్‌ ఎస్సైకి అప్పచెప్పినట్లు స్పెషల్‌ ఎన్ఫోర్స్‌మెంట్‌ బ్యూరో సిఐ షేక్‌ ఖాజా మొహిద్దీన్‌ తెలిపారు. అదే విధంగా కందుకూరు మండలంలోని ఉప్పుచెరువు వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా కందుకూరు రూరల్‌ మండలంలోని విక్కిరాలపేట గ్రామానికి చెందిన యమ్‌.నరసింహారావు అను వ్యక్తి ఎటువంటి అనుమతి లేకుండా అక్రమంగా ఇసుకను ట్రాక్టర్లో తరలిస్తుండగా మార్గమద్యంలో పట్టుకుని కేసు నమోదు చేసి తదుపరి విచారణ నిమిత్తం ముద్దాయిని మరియు ఇసుకతో సహా ట్రాక్టరును టౌన్‌ పోలీసు స్టేషన్‌లో అప్పగించినట్లు స్పెషల్‌ ఎన్ఫోర్స్‌మెంట్‌ బ్యూరో సిఐ షేక్‌ ఖాజామొహిద్దీన్‌ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement