Friday, November 22, 2024

త్రాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు..

ఉలవపాడు : మండల కేంద్రమైన ఉలవపాడులోని మండల ప్రజా పరిషత్‌ కార్యాలయంలో కందుకూరు శాసనసభ్యులు మానుగుంట మహీధర్‌ రెడ్డి మండల స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల స్థాయి అధికారులు సమన్వయంతో సంక్షేమాభివృద్ధి సాధించవచ్చునని ఆయన తెలిపారు. ముఖ్యంగా రానున్న వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని మండల పరిధిలోని 12 పంచాయితీల లో త్రాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, ఏ పంచాయితీ అయితే త్రాాగునీరు సమస్య తలెత్తే పరిస్థితి ఉందో ముందుగానే గమనించి దానికి ముందస్తు చర్యలు తీసుకోనేలా పంచాయితీలకు దిశా నిర్దేశం చేయాలని వారికి తెలిపారు. అదే విధంగా మండలంలోని ప్రభుత్వ, ప్రైవేటు మరియు అంగన్‌వాడీ పాఠశాలలను వారంలో సగటున రెండు పాఠశాలలు తనిఖీచేసి దానికి సంబంధించిన నివేదికలను సమర్పించాలని, అమ్మఒడి, విద్యా దీవెన, నాడు నేడు కార్యక్రమాలపై ప్రత్యేక శ్రద్ధ చూపించాలని తెలిపారు. అదే విధంగా ఉపాధిహామీ పనులు సక్రమంగా జరిగేలా కూలీల సంఖ్య పెంచేలా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో రవికుమార్‌ మరియు మండల విద్యాశాఖ అధికారి, 12 పంచాయితీల కార్యదర్శులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement