ఉలవపాడు : ఉలవపాడు మండలంలో వైఎస్‌ఆర్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండలంలోని ఉలవపాడుతోపాటు కరేడు, చాకిచర్ల, వీరేపల్లి, భీమవరం, రాజుపాలెం తదితర గ్రామాలలో వైఎస్‌ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరరం ప్రజలకు మిఠాయిలను పంపిణీచేశారు. ఈ సందర్భంగా కరేడు నాయకులు అచ్యుతరెడ్డి మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేద ప్రజలకు ఎంతో మంచి పనులుచేశారని, 108 ఏర్పాటుచేసిన ఘనత కూడా ఆయనకే దక్కుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రచారకమిటీ సభ్యుడు ఆర్ సింగారెడ్డి, ఉలవపాడు వైఎస్‌ఆర్ పార్టీ అధ్యక్షులు కృష్ణారెడ్డి, వైఎస్‌ఆర్ పార్టీ మండలాధ్యక్షుడు చంద్రశేఖర్, భీమయ్య, ధనకోటి, చింతం రాము, పరంధామిరెడ్డి, సీతారాం రెడ్డి, మధురెడ్డి, మాజీ సర్పంచ్ పోతురాజు, ఆలూరి సింగయ్య, ఆలూరి రమేష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement