కందుకూరు టౌన్ : కేంద్ర ప్రభుత్వం పిలుపు మేరకు కందుకూరు పట్టణంలోని టిఆర్‌ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ సేవా పధకం విభాగం వారు ఆజాది కా అమృత్ మహోత్సవ్ 75 సంవత్సరాల భారత స్వాతంత్య్ర వేడుకల కార్యక్రమాన్ని కళాశాలలో ఘనంగా నిర్వహించారు. 75 సంవత్సరాల భారత స్వాతంత్య్రంను కేంద్ర ప్రభుత్వం 75 వారాల పాటు వివిధ దేశభక్తి కార్యక్రమాలతో నిర్వహించాలని సూచించింది. ఈ కార్యక్రమంలో భాగంగా గాంధీ గారి ఉప్పుసత్యాగ్రమ దినోత్సవం నాడు భారత ప్రధానమంత్రి గుజరాత్‌లో దండి గ్రామం నుండి ఈ కార్యక్రమం ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని కళాశాల వైస్ ప్రిన్సిపాల్ విజయశ్రీ ప్రారంభించారు. విద్యార్ధులు స్వాంత్య్ర ఉద్యమ స్పూర్తిని, జాతీయేద్యమ నాయకుల త్యాగాలను అవలంబించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎన్‌ఎస్‌ఎస్ అధికారులు కె.మాలకొండయ్య, డాక్టర్ సిహెచ్ శంకర్‌రావు, ఇతర అధ్యాపకులు మస్తాన్‌వలి, కోటేశ్వరరావు, సాయికృష్ణ, జీవన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్ధులకు బహుమతులు అందజేశారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement