Monday, November 25, 2024

కరోనా వ్యాక్సిన్‌ పట్ల అపోహలు వీడండి – ఎమ్మెల్యే మానుగుంట మహీధర్‌ రెడ్డి

కందుకూరు టౌన్‌ , : ప్రపంచాన్ని ప ట్టి పీడిస్తూ విలయతాండవం చేసి ఎంతో మంది ప్రాణాలను బలిగొన్న కరోనా మహమ్మారి బారి నుండి రక్షింపబడాలంటే వ్యాక్సిన్‌ వేయించుకోవడమే శరన్యమని శాసనసభ్యులు మానుగుంట మహీధర్‌ రెడ్డి స్పష్టంచేశారు. వ్యాక్సిన్‌ రెండో విడత కార్యక్రమం సందర్భంగా ఎమ్మెల్యే మహీధర్‌ రెడ్డి వ్యాక్సిన్‌ వేయించుకున్నారు. కందుకూరు మండలంలోని ఆయన స్వగ్రామం మాచవరం ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో జరిగిన వ్యాక్సినేషన్‌ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యాక్సినేషన్‌ పట్ల ప్రజలలో ఉన్న అనుమానాలు, అపోహలతో, మూఢనమ్మకాలతో ప్రజలు దూరంగా ఉండటం ఏమాత్రం మంచిది కాదని హితవు చెప్పారు. వ్యాక్సిన్‌ వేయించుకున్న ఒకళ్ళిద్దరు ఇతర ఆరోగ్య సమస్యల కారణంగా మరణిస్తే అది వ్యాక్సిన్‌ కారణంగా జరిగి ఉంటుందన్న అపోహలతో భయపడటం సరికాదని అన్నారు. ఇప్పటికి దేశంలో కోటి మందికి పైగా వ్యాక్సిన్‌ వేయించుకున్నారని, వ్యాక్సిన్‌ వికటించి మరణించిన ఘటన ఎక్కడా ఋజువు కాలేదని అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా సెకండ్‌ వేవ్‌ ప్రజలను బలితీసుకుంటున్న దశలో మనదేశంలో కూడా పలు రాష్ట్రాలలో కేసులు పెరుగుతున్నాయని, మహమ్మారి నుండి రక్షింపబడాలంటే వ్యాక్సిన్‌ వేయించుకోవడమే మార్గమని మహీధర్‌ రెడ్డి స్పష్టంచేశారు. ప్రాధమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిణి డాక్టర్‌ స్వాతి శాసనసభ్యులు మానుగుంట మహీధర్‌ రెడ్డికి వ్యాక్సిన్‌ను వేశారు. ఆయనతోపాటు పలువురు పాత్రికేయులు, గ్రామస్తులు, వ్యాక్సినేషన్‌ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement