ఉలవపాడు : మండల పరిధిలోని ఉపాధిహామీ పనుల గుర్తింపు తీవ్ర అపహాస్యం చోటు చేసుకుంటుంది. ఉపాధి పనులు రైతులకు, ప్రజలకు ఉపయోగకరమైన వాగులు, డొంకలు, కరకట్టలు రిపేరు చేపించి కూలీలకు పనులు కల్పించి ఉపాధి కల్పించాలని గొప్ప లక్ష్యంతో ఏర్పాటుచేసి ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా చేపడుతుంది. అయితే ఉలవపాడులోని ఉపాధిహామీ సిబ్బంది పనితీరు పలు విమర్శలకు తావిస్తోంది. ఉపాధిహామీ పనులు గుర్తించడంలో నిర్లక్ష్యానికి పరాకాష్టగా మారింది. ఆత్మకూరు పంచాయితీలో మన్నేరులో ఉపాధి హామీ పనులు గుర్తించి మట్టి ఎందు తీశారా…? దీనివల్ల ఎవరికి లాభం…? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు అసలు ఏటిలో మట్టి తీయవచ్చ…? గట్టున కదా తీయాల్సింది అని ప్రజలు గుస గుసలు వినిపిస్తున్నాయి. రెండు రోజులకు ఒకసారి ఉపాధిహామీ పనులు పరిశీలించి ముందస్తు చర్యలు చేపట్టే ఎంపిడిఓ ఈ విషయంపై ఎందుకు సమాలోచన చేయలేదో, ఆ పని గుర్తింపులో ఎందుకు చేశారో అర్ధం కావడం లేదని కూలీలే గుస గుసలాడుతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి మసి పూసి మారేడు కాయ చేసే టువంటి పనులు మాని ప్రజలకు, రైతులకు ఉపయోగకరమైన పనులు చేపట్టాలని పలువురు గ్రామస్తులు, రైతులు కోరుకుంటున్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement