Friday, November 22, 2024

ఇండ్ల మధ్యలో వేలడుతున్న విద్యుత్‌ తీగలను తొలగించాలి – సిపిఎం

ఉలవపాడు , ఉలవపాడు మండల కేంద్రంలోని వరిగచేను సంఘంలోని గిరిజనులకు నివాసం ఉంటున్న ఇండ్ల మధ్యలో విద్యుత్‌ లైన్లు క్రిందకు వ్రేలాడుతున్నాయని, అట్లా ఉంటే ప్రమాదకరమని, లైన్లు క్రిందకు దిగి ఉన్నచోట అదనంగా స్థంబాలు వేసి ప్రమాదాలు జరుగకుండా చూడాలని సిపిఎం గుడ్లూరు మండల నాయకులు ఎస్‌.డి.గౌస్‌బాషా ప్రభుత్వ అధికారులను కోరారు. సిపిఎం పార్టీ ఉలవపాడు మండలం నాయకులు పోట్లూరి రవి, ఏలూరి నాగార్జునతో కలిసి వరిగచేను సంఘం గిరిజన కాలనీలో పర్యటించి గిరిజనుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. చాలా మందికి ఆధార్‌ కార్డులు లేవని, కరెంటు తీగల సమస్య చాల ప్రమాదకరంగా ఉందని చెప్పారు. తక్షణమే అధికారులు స్పందించి గిరిజనుల సమస్యలు పరిష్కరించాలని ఆయన ప్రభుత్వ అధికారులను కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement