Tuesday, November 26, 2024

అర్జీని అందజేస్తున్న కెవిపిఎస్‌ నాయకులు


కందుకూరు టౌన్‌ , మార్చి 16(ప్రభ న్యూస్‌): గుడ్లూరు మండలం చేవూరు ఆది ఆంధ్ర కాలనీలో అంబేద్కర్‌ విగ్రహం ఏర్పాటుకు స్థలం కేటాయించాలని కందుకూరు సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం వద్ద కెవిపిఎస్‌ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రిటైర్డ్‌ సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ బి.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ చేవూరు గ్రామంలో సర్వే నెం.581 లో ప్రభుత్వ స్థలంలో అంబేద్కర్‌ విగ్రహం ఏర్పాటుకు అనుమతి మంజూరు చేయాలని ఆయన డిమాండ్‌చేశారు. ఆ స్థలంలో విగ్రహం తొలగించడం అంటే అంబేద్కర్‌ను దళిత జాతిని అవమానించినట్లే అని అన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు జి.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కాలనీలో ఇండ్లు లేని పేదలకు పక్కనే ఉన్న ప్రభుత్వ స్థలంలో ఇళ్ళు కేటాయించాలని డిమాండ్‌చేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సామాజిక వేత్తలు పాలేటి కోటేశ్వరరావు, సిఐటియు కార్యదర్శి జివిబి కుమార్‌, కెవిపిఎస్‌ నాయకులు సాధు చెన్నకేశవులు, మన్నెం రమేష్‌, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు ఎస్‌.అరుణ్‌ సుందరం, చేవూరు దళితులు సిహెచ్‌ రాజగోపాల్‌, జి.నాగేశ్వరమ్మ, జి.చక్రి, సిహెచ్‌ మరియమ్మ, జి.సంపత్‌ కుమార్‌, జి జైపాల్‌ పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement