Friday, November 22, 2024

Prakasam – విక్టోరియా మహరాణి కాలం నాటి బంగారు నాణేలు ల‌భ్యం…

ఎర్ర‌గొండుపాలెం – నాల్గవ విక్టోరియా మహరాణి కాలం నాటి బంగారు నాణేలు పశ్చిమ ప్రకాశంలోని ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో గల వెంకటాద్రిపాలెం గిరిజన గూడెంకు చెందిన ఐదు మంది గిరిజనులకు దొరికాయి .. తెలంగాణ ప్రాంతంలోని సాగర్ పరివాహక ప్రాంతంలో గల కృష్ణానది వద్ద అచ్చమ్మ కుంట వద్ద మొత్తం తొమ్మిది నాణేలు ల‌భించిన‌ట్లు గిరిజనులు చెబుతున్నారు .. ఈ సమాచారాన్ని అట‌వీ శాఖ అధికారుల‌కు తెలిపారు.. అవి నాల్గవ సంతతికి చెందిన విక్టోరియా మహారాణి కాలం నాటివ‌ని నిర్ధారించారు… వాటి విలువ మార్కెట్లో పెద్ద మొత్తంలో ఉంటుందని సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement