Wednesday, October 16, 2024

Prakasam Barrage – సముద్రంలోకి కృష్ణమ్మ బిరబిరా…

(ఎన్టీఆర్ ప్రభ న్యూస్ బ్యూరో)కృష్ణా నది పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు తోడు, శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులు నిండిన తరుణంలో, పులిచింతల కూడా గరిష్ట నీటిమట్టానికి చేరుకోవడంతో దిగువకు వరద నీటిని అధికారులు విడుదల చేసిన నేపథ్యంలో ప్రకాశం బ్యారేజీ గరిష్ట నీటిమట్టానికి చేరుకుంది. పులిచింతల నుండి లక్షకు పైగా క్యూస్క్కుల వరద నీరు ప్రకాశం బ్యారేజీకి వచ్చి చేరడంతో ప్రస్తుతం బ్యారేజీ వద్ద గరిష్ట నీటిమట్టం 12 అడుగులకు చేరుకుంది.

నిండుకుండను తలపిస్తున్న ప్రకాశం బ్యారేజీ వద్ద వస్తున్న మిగులు జలాలని బ్యారేజీ గేట్లను ఎత్తి దిగువకు అధికారులు వరద నీటిని విడుదల చేస్తున్నారు. మంగళవారం రాత్రి 10 గంటలకు 10.6 అడుగుల నీటిమట్టం ఉండగా, అర్ధరాత్రి సమయానికి అది 12 అడుగులకు చేరుకుంఈది.

దీంతో అధికారులు ప్రకాశం బ్యారేజీ మొత్తం 70 గేట్లకు గాను 45 గేట్లను ఒక అడుగు మేర ఎత్తి నీటిని సముద్రంలోకి విడుదల చేశారు. ప్రస్తుతం 46,102 క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉండగా, సాగునీటి అవసరాల కోసం కాలువలకు 13,477 క్యూ సెక్యుల నీటిని విడుదల చేయడంతో పాటు 32,625 క్యూసెక్కుల నీటిని సముద్రంలోనికి విడుదల చేస్తున్నారు. గంట గంటకు బ్యారేజీ వద్ద నీటి ప్రవాహం పెరుగుతున్న నేపథ్యంలో అవుట్ ఫ్లో మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు, నది పరివాహక ప్రాంతాల్లోని ప్రజలను అధికారులను అప్రమత్తం చేస్తున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement