Thursday, September 12, 2024

Prakasam Barrage : బ్యారేజ్ కి పోటెత్తుతున్న వరదనీరు

పులిచింతల, సాగర్ నుంచి భారీగా మిగులు జలాలు
ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 3లక్షల 35 వేల క్యూసెక్కులు
నిండుకుండను తలపిస్తున్న ప్రకాశం బ్యారేజీ
70గేట్లు ఎత్తి సముద్రంలోకి నీటి విడుదల
నదీ పరివాహక ప్రాంతాలను అప్రమత్తం చేసిన అధికారులు


(ప్రభ న్యూస్, ఎన్టీఆర్ బ్యూరో) : కృష్ణానది ఎగువ ప్రాంతాల్లో ఉన్న పులిచింతల, నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల నుండి మిగులు జలాలు పెద్ద ఎత్తున తరలివస్తుండడంతో ప్రకాశం బ్యారేజీ వద్ద వరద నీటీ ప్రవాహం గంట, గంటకు పెరుగుతూ వస్తోంది. పైన ప్రాజెక్టుల నీటి నిల్వ సామర్థ్యం పూర్తిస్థాయిలో నిండిన నేపథ్యంలో దిగువకు మిగులు జలాలను విడుదల చేసిన తరుణంలో గురువారం రాత్రికి సుమారు లక్షన్నర క్యూసెక్కుల వరద నీరు చేరుకోగా అది కాస్త శుక్రవారం నాటికి మూడున్నర లక్షల క్యూసెక్కులకు చేరుకుంది.

ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీ పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 3.09 టీఎంసీలు నిండి, 12అడుగుల మేర నీటినిల్వ ఉన్న నేపథ్యంలో బ్యారేజీ నిండు కుండను తలపిస్తోంది. బ్యారేజీ నీటి సామర్థ్యం నిండిన సందర్భంలో మిగులు జలాలను బ్యారేజీ 70గేట్లను అడుగు మేర ఎత్తి 3,18,850 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడిచిపెడుతున్నారు.

- Advertisement -

ఇదే సందర్భంలో సాగునీటి అవసరాల కోసం 16,201 వేల క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేశారు. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీ వద్ద ఇన్ ఫ్లో 3,35,051 ఉండగా, కాలువలకు, సముద్రంలోకి విడుదల చేసిన నీటితో అవుట్ ఫ్లో 3,35,051 గా ఉంది. ఇది కాస్త శుక్రవారం అర్ధరాత్రికి మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో కృష్ణా నది పరివాహక ప్రాంతాలలోని ప్రజలను అప్రమత్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement