Tuesday, November 19, 2024

ప్రకాశం బ్యారేజీకి వరద ప్రవాహం.. 60 గేట్లు ఎత్తివేత

ఏపీలో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. ప్రకాశం బ్యారేజీకి గంట గంటకు వరద ప్రవాహం పెరుగుతోంది. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో ప్రకాశం బ్యారేజీకి పెద్దఎత్తున వరద నీరు  చేరుతోంది. కృష్ణా జిల్లాలో గడిచిన 48 గంటల నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఎగువ నుంచి వస్తున్న వరద నీరు.. జిల్లాలో కురుస్తున్న భారీ వర్షంతో ప్రకాశం బ్యారేజీ నిండుకుండను తలపిస్తోంది. ఇన్ ఫ్లో  52,561 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 50 వేల క్యూసెక్కులుంది. ప్రస్తుతం బ్యారేజీ నీటి మట్టం 12 అడుగులకు చేరింది. దీంతో అధికారులు ప్రకాశం బ్యారేజీ 60 గేట్లు ఒక అడుగు మేర ఎత్తి దిగువకు వరద నీరు వదులుతున్నారు.

ఇది కూడా చదవండి: గోదావరిలో చిక్కుకున్న స్వామీజీలు.. కాపాడిన ఎన్డీఆర్ఎఫ్ బృందాలు

Advertisement

తాజా వార్తలు

Advertisement