తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌కు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో ఊరట లభించింది. ఏలూరు జిల్లా చింతలపూడి పోలీసులు నమోదు చేసిన కేసులో తదుపరి చర్యలపై హైకోర్టు ధర్మాసనం స్టే ఇచ్చింది. గతవారం చింతలపూడిలో ‘బాదుడే బాదుడు’ నిరసన కార్యక్రమంలో చింతమనేని పాల్గొనగా.. ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో టీడీపీ నేత హైకోర్టును ఆశ్రయించారు. వాదనలు విన్న ధర్మాసనం తదుపరి చర్యలపై స్టే ఇచ్చింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement