Saturday, November 23, 2024

వ్యర్థాల నుంచి విద్యుత్ ఉత్పత్తి.. గుంటూరు విశాఖ జిల్లాల్లో కొత్త ప్రాజెక్టులు..

అమరావతి, (ప్రభన్యూస్): వ్యర్థాల నుంచి విద్యుత్‌ తయారీ కర్మాగారాల జాబితాలో ఇప్పుడు ఏపీ కూడా ఒకటవనుంది. ఇప్పటికే ఇటువంటి కర్మాగారాలు దేశంలో ఐదు ఉన్నాయి. ఇవి ఢిల్లీలో మూడు, మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌, హైదరాబాద్‌లో ఒక్కొక్కటి చొప్పున ఉండగా, ఏపీలో గుంటూరు, విశాఖ జిల్లాల్లో ఇదే కర్మాగారాలు ఏర్పడనున్నాయి. దీంతో ఏపీలో ఏర్పడనున్న రెండింటితో కలిపి మొత్తం ఏడయ్యాయి. డంపింగ్‌ యార్డులో కుప్పలుగా పడి పర్యావరణానికి హాని కలిగిస్తున్న ఈ వ్యర్థాలు ఇకపై వెలుగులను వెదజల్లనున్నాయి. దీనికి గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని నాయుడు పేటలో 15.50 ఎకరాల్లో ఏర్పాటు-చేసిన కర్మాగారం వేదికగా కానుంది. ప్రభుత్వ, ప్రైవేటు- భాగస్వామ్యం(పీపీపీ) విధానంలో జిందాల్‌ సంస్థ రూ.340 కోట్లతో ఈ కర్మాగారాన్ని ఏర్పాటు- చేసింది. గత సెప్టెంబర్‌ 30 నుంచి అక్టోబర్‌ 8 వరకూ ప్రయోగాత్మకంగా ఇక్కడ విద్యుత్‌ను ఉత్పత్తి చేశారు. ఇది విజయవంతమవడంతో పూర్తిస్థాయిలో విద్యుదుత్పత్తికి సన్నాహాలు చేస్తున్నారు.

రోజుకు 1,200 మెట్రిక్‌ టన్నుల వ్యర్థాలతో 15 మెగా వాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసే సామర్థంతో కర్మాగారాన్ని ఏర్పాటు-చేశారు. విజయవాడ, గుంటూరు, తాడేపల్లి- మంగళగిరి నగరపాలక సంస్థలతో పాటు-సత్తెనపల్లి, చిలకలూరిపేట, నరసరావుపేట, పొన్నూరు, తెనాలి పురపాలక సంస్థల నుంచి వ్యర్థాలను ఇక్కడికి తీసుకొస్తారు. చెత్తను నిల్వ చేసేందుకు 25 మీటర్ల వెడల్పు, 71 మీటర్ల పొడవుతో పిట్‌ను నిర్మించారు. పిట్‌లో ఉన్న వ్యర్థాలను గ్రాబ్‌ క్రేన్‌ సాయంతో ఫీడర్‌లో వేస్తారు. ఉత్పత్తి అయిన విద్యుత్‌ను వెంగళాయపాలెంలోని విద్యు త్‌ సబ్‌ స్టేషన్‌కు సరఫరా చేసేందుకు వీలుగా కర్మాగారం నుంచి 32 కేవీ విద్యుత్‌ లైన్‌ను వేశారు. కర్మాగారంలో ఉత్పత్తి అయిన విద్యుత్‌ను డిస్కమ్‌లకు యూనిట్‌కు రూ.6.16కు విక్రయిస్తారు.

విశాఖపట్నంలో కూడా 15 మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యం గల మరో కర్మాగారం నిర్మాణం లో ఉంది. 2016లో కర్మాగారాల ఏర్పాటుకు జిందాల్‌ సంస్థకు అనుమతులు లభించినా, అప్పట్లో ఈపనులు కొన్ని సాంకేతిక కారణాలవల్ల ముందుకు సాగలేదు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చాక నిర్మాణ పనులు వేగవంతమయ్యాయి. ఈ రెండు కర్మాగారాల ఏర్పాటు-తో సుమారు 400 మందికి ఉపాధి లభిస్తోంది..

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. రియల్ టైమ్ న్యూస్ అప్ డేట్స్ కోసం.. ప్రభన్యూస్ ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి
https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement