ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో విద్యుత్ కోతలు తక్కువనని ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. మంత్రి విద్యుత్ ఉద్యోగుల జేఏసీ నేతలతో భేటీ అయ్యారు. మూడు నెలల్లో ఎన్టీటీపీఎస్ స్టేజ్ 5 పూర్తి చేయాలన్నారు. కృష్ణపట్నం స్టేజ్ 2 ప్లాంట్ నిర్మాణం వేగవంతం చేయాలన్నారు. ఈ రెండు ప్లాంట్లు వినియోగంలోకి వస్తే 1600 మెగావాట్ల అదనపు విద్యుత్ అందుతుందన్నారు. కొత్త హైడెల్ ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రాధాన్యమన్నారు. ప్రజలకు మెరుగైన విద్యుత్ అందించడమే లక్ష్యమన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement