అమరావతి, ఆంధ్రప్రభ: చదుపుకు పేదరికం అడ్డుకారాదు.. పేదరిక అసమానతలు తొలగిపోవాలన్నా.. మన తలరాతలు మారాలన్నా.. అణగారిన వర్గాల్లో నుంచి ప్రతి కుటుంబంలో ఇంజనీర్లు, డాక్టర్లు పుట్టుకురావాలి.. అందుకు ఈ ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఫీజుల రీ యింబర్స్మెంట్ కల్పిస్తుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భరోసా ఇచ్చారు. 100శాతం అక్షరాస్యత ఈ ప్రభుత్వ లక్ష్యం కాదు.. అంతా గ్రాడ్యుయేట్లుగా ఎదగాలనేదే ఆకాంక్ష అన్నారు. జగనన్న విద్యాదీవెన పథకంలో భాగంగా తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి మీట నొక్కి 11.03 లక్షల మంది విద్యార్థులకు మూడో విడతగా రూ. 686 కోట్లు తల్లుల ఖాతాలో జమ చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ చదుపుకునే పేద విద్యార్థు లకు తమ ప్రభుత్వం భరోసా కల్పిస్తుందన్నారు. ఫీజు రీ యింబర్స్ మెంట్ కింద గత ప్రభుత్వం పెండింగ్లో ఉంచిన రూ. 1778 కోట్లతో కలిపి ఇప్పటి వరకు రూ. 6259 కోట్లు విడుదల చేశామని తెలిపారు. దీనివల్ల 21 లక్షల 48వేల 477 మంది విద్యార్థులకు లబ్ది చేకూరిందని వివరిం చారు.
దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ హయాంలో ప్రవేశ పెట్టిన ఈ పథకాన్ని గత ప్రభుత్వాలు నీరుకార్చాయని ఆవేదన వ్యక్తం చేశారు సీఎం జగన్మోహన్రెడ్డి. గతంలో ఫీజులు చెల్లించే స్తోమతులేక, రీ యింబర్స్మెంట్ రాక ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సంఘటన తన మనసును కలచి వేసిందని గుర్తుచేసుకున్నారు. తన పాదయాత్రలో ఈ విషయాన్ని తల్లిదండ్రుల ద్వారా తెలుసుకుని ఇకపై ఏ పేద విద్యార్థికి ఇలాంటి అన్యాయం జరక్కూ డదనే ఉద్దేశంతో పూర్తిస్థాయి ఫీజు రీ యింబర్స్ మెంట్ అందజేస్తున్నట్లు తెలిపారు. కుటుంబంలో ఎంతమంది పిల్లలు చదువుకున్నా వారికి జగనన్న విద్యాదీవెన పథకం కింద రీ యింబర్ ్స మెంట్ వర్తింప చేస్తున్న ట్లు చెప్పారు. కళాశాలలో వసతులు, విద్యా బోధన సక్రమంగా లేదని గుర్తిస్తే 1902 టోల్ ఫ్రీ నెంబర్కు ఫిర్యాదు చేయాలని ప్రభుత్వం జోక్యం చేసుకుంటుందని భరోసా ఇచ్చారు. ఫీజులు సక్రమంగా చెల్లించకపోతే తల్లుల ఖాతా నుంచి కళాశాలలకు నేరుగా జమవుతాయని అందువల్ల తల్లులు తమ పిల్లల పట్ల శ్రద్ద చూపాలన్నారు.
తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అన్ని ప్రైవేట్ విశ్వ విద్యాలయాలు, మెడికల్, డెంటల్ కళాశాలలు కచ్చితంగా 50 శాతం, ఇంజనీరింగ్, డిగ్రీ కోర్సుల్లో 35 శాతం కన్వీనర్ కోటాగా, ప్రభుత్వ కోటా భర్తీ చేసేందుకు చట్టంలో మార్పులు తెచ్చామన్నారు. ఈ ఏడాది 2118 మంది విద్యార్థులకు అవకాశం లభించిందని తెలిపారు. ఇటీవల ఉన్నత విద్యాశాఖ నిర్వహించిన సర్వేలో రాష్ట్రంలో ఉన్నత విద్య కోసం 17 నుంచి 23 సంవత్సరాల మధ్య కళాశాలల్లో చేరే విద్యార్థుల గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో (స్థూల హాజరు శాతం) 2020 నాటికి 35.2 శాతానికి పెరిగిందన్నారు.
దేశం కంటే మెరుగైన పరిస్థితుల్లో ఉన్నాం.. అయితే ప్రయాణించా ల్సిన దూరం చాలా ఉందన్నారు. పిల్లలందరికీ మెరుగైన ఉద్యోగాలు రా వాలనేదే మా ఆశయం.. ఇందులో భాగంగా ప్రస్తుతం ఉన్న 11 మెడికల్ కళాశాలలతో పాటు కొత్తగా 16 వైద్య కళాశాలలను మరో రెండేళ్లలో అందుబాటులోకి తెస్తామని ప్రకటించారు. విజయనగరం జిల్లా గురజా డలో జేఎన్టీయూ, ప్రకాశం జిల్లాలో ఆంధ్రకేసరి విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేస్తున్నామని కడపలో ఆర్కిటెక్చర్ యూనివర్శిటీ, కురుపాం లో ఇంజనీరింగ్, పాడేరులో మెడికల్, సాలూరులో ట్రైబల్ యూని వర్శిటీల రాకతో రాష్ట్రం నలుమూలల విద్యాసుమాలు వికసిస్తాయనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. కొత్తగా 2019 నుంచి ఇప్పటి వరకు 10 డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేశామని 154 ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో రూ. 880 కోట్లతో నాడు- నేడు కింద అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. రెండేళ్లలో ఇవి పూర్తి కాగలవన్నారు. ప్రతి డిగ్రీ విద్యార్థికి అప్రెంటీస్, అనుభవం కోసం కోర్సుల్లో మార్పులకు శ్రీకారం చుట్టామన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం ఫేస్బుక్, ట్విట్టర్ పేజీలను ఫాలో అవ్వండి..