Thursday, November 21, 2024

టెక్నాలజీ ద్వారానే పేదరికాన్ని ఎదుర్కోగలం.. ఇస్రో చైర్మన్‌ సోమ్‌నాథ్‌

అనంతపురం, ప్రభన్యూస్‌ బ్యూరో: కేవలం టెక్నాలజీ ద్వారానే దేశంలో పేదరికం, ఆకలి, అనారోగ్యం వంటి సామాజిక సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కోగలమని ఇస్రో చైర్మన్‌ ఎస్‌.సోమ్‌నాథ్‌ పేర్కొన్నారు. ఇస్రో చైర్మన్‌ శనివారం అనంతపురం జేఎన్టీయూలో నిర్వహించిన 12వ స్నాతకోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఒకప్పుడు ఆకలితో అలమటించిన దేశం అనంతరం టెక్నాలజీలో వచ్చిన మార్పుల కారణంగా హరిత విప్లవం ద్వారా గోధుమ ఉత్పత్తి పెంచి ఆకలిని జయించిందన్నారు. స్వాతంత్రం వచ్చే నాటికి దేశంలో సగటు- మనిషి జీవిత కాలం 30 ఏళ్లకు అటు ఇటుగా ఉండేదని, వైద్య రంగంలో వచ్చిన సాంకేతిక పరిజ్ఞానం ద్వారా అది దాదాపు 70 ఏళ్లకు చేరుకుందన్నారు. టెక్నాలజీ అభివృధ్ధిలో విద్యార్థులు భాగస్వాములై దేశాభివృద్ధికి దోహద పడాలని పిలుపునిచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement