Wednesday, November 20, 2024

డేంజర్ లో కుమ్మరికుంట చెరువు.. పట్టించుకోని అధికారులు

వెదురుకుప్పం, (ప్రభన్యూస్): గత కొంత కాలంగా కురుస్తున్న వర్షాలకు మండలంలోని అన్ని చేరువులు పూర్తిగా నీటితో నిండిపోయాయి. ఈ క్రమంలో బ్రాహ్మణ పల్లి పంచాయతీలోని కుమ్మరిగుంట చేరువు పూర్తిగా నిండిపోవడంతో చేరువు కట్టలో నీళ్ళు లీకేజీ అవుతుందని, స్థానిక సర్పంచ్ బట్టే శిరీషా చాణిక్య ప్రతాప్ సంబంధిత శాఖ అధికారులుకు పిర్యాదు చేసిన పట్టించుకోకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు అక్క‌డి ప్ర‌జ‌లు. ప్రమాదవశాత్తు కుమ్మరిగుంట చెరువు తెగితే, ఆ నీళ్ళు మరో రెండు చెరువుల్లోకి వెళ్ళి అక్కడ ఆ చెరువులు కూడా తెగిపోయే ప్రమాదం ఉందని పంచాయతీ ప్రజలు వాపోతున్నారు.

చెరువు నిండిన ప్రతిసారి ఇలాగే కట్టనుండి లీకేజీ అవుతున్న ఇరిగేషన్ శాఖ అధికారులు పట్టించుకోక పోవడం పై రైతుల పలురకాల విమర్శల చేస్తున్నారు. ఇరిగేషన్ సెట్ అయ్యి చుట్టం చూపుగా వచ్చి వెళ్లిపోవడం ఏదో ఒక కుంటి సాకు చెప్పి పోవడంపై అంతర్యం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఈ చెరువు నీటి వల్ల కొన్ని వందల ఎకరాల భూమి సాగు చేసుకుంటూ రైతులు బ్రతుకుతున్నారు. అయినప్పటికీ చెరువులోకి వచ్చిన నీరు అంతా లీకేజీ ద్వారా వెళ్లిపోవడంతో నిరాశకు గురవుతున్నామని రైతులు ఆందోళన చెందుతున్నారు.

విషయం తెలుసుకున్న తహశీల్దార్ పార్వతి బుధవారం ఉదయం సర్పంచ్ శిరీషా చాణిక్య, కార్యదర్శి ధనలక్ష్మి, విఆర్వోధనశేఖర్, సచివాలయం సిబ్బందితో కలిసి కుమ్మరిగుంట చెరువు లీకేజీ నీ పరిసిలించారు. లీకేజీ విషయాన్ని ఇరిగేషన్ అధికారులుకు తెలియజేశారు. సాయంత్రం ఇరిగేషన్ ఎఇ వచ్చి చెరువు లీకేజీ ని పరిసిలించి త్వరగా మరమ్మతులు చేస్తామని చెప్పినట్లు స్థానిక రైతులు చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement