ఆంధ్ర ప్రభ స్మార్ట్ – ఆమ రావతి: ఏపీ సీఎం చంద్రబాబు కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ రాజమౌళి నియమితులయ్యారు. ఇటీవల కేంద్ర సర్వీసుల నుంచి రిలీవ్ అయిన రాజమౌళి శుక్రవారం ఏపీ ప్రభుత్వానికి రిపోర్ట్ చేశారు.
రిపోర్టు చేసిన వెంటనే ఆయనకు పోస్టింగ్ లభించింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రాజమౌళి 2003 బ్యాచ్ ఉత్తర్‌ప్రదేశ్ క్యాడర్ ఐఏఎస్ అధికారి. తెదేపా ప్రభుత్వంలో 2015-19 మధ్య ముఖ్యమంత్రి కార్యదర్శిగా సీఎంఓలో పనిచేశారు. ప్రస్తుతం ఉత్తర్‌ప్రదేశ్ హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
- Advertisement -